గువాహటి: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్ఇండియా (Team India) తడబడుతున్నది. భారత బౌలింగ్‌లో తేలిపోవడంతో దక్షిణాఫ్రికా (IND vs SA) తమ తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్థితిలో నిలిచింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడంతో సఫారీ జట్టు 489 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక రెండో రోజు చివరి సెషన్లో బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. వికెట్లేమీ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. మూడో రోజు (సోమవారం) ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే టీమ్ఇండియాకు షాక్ తగిలింది. చకచకా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. జట్టు స్కోరు 65 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 21.3వ ఓవర్లో కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (22) ఐడెన్ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
మరో ఎండ్‌లో మంచి ఊపులో ఉన్నట్లు కనిపించిన యశస్వీ జైస్వాల్ 85 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే జట్టు స్కోరు 95 వద్ద జైస్వాల్ (58) సైబన్ ఆర్మర్ బౌలింగ్‌లో మార్కో యాన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంది వచ్చిన మంచి అవకాశాన్ని సాయి సుదర్శన్ మరోసారి చేజార్చుకున్నాడు. మరోసారి స్వల్ప స్కోర్‌కే (15) పెవీలియన్‌కు చేరాడు. ఇక ఆదుకుంటానుకున్న ద్రువ్ జురెల్ కూడా డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం కెప్టెన్ రిషభ్ పంత్ (6), రవీంద్ర (0) క్రీజులో ఉన్నారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. మరో 387 పరుగులు వెనకబడింది.