ముంబై: చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా శనివారం దుబాయ్‌కి బయల్దేరి వెళ్లింది. చత్రపతి శివాజీ విమానాశ్రయంలో టీమ్ఇండియా క్రికెటర్లకు అభిమానులు వీడ్కోలు పలికారు. కెప్టెన్ రోహిత్‌శర్మ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే ఫ్యాన్స్ ఒక్కసారిగా అరుపులు, కేకలతో గోల చేశారు.
స్టార్ క్రికెటర్ విరాట్‌కోహ్లీ, శుభ్‌మన్ గిల్, చీఫ్ కోచ్ గౌతం గంభీర్‌తో సహా క్రికెటర్లందరూ ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. చాంపియన్స్ ట్రోఫీలో తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాతో తలపడనుంది.