న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir ).. ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల అతను వచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 20వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కావాల్సి ఉన్నది. గౌతం గంభీర్ తల్లికి గుండెపోటు వచ్చినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది. ఆమె ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. అయితే వచ్చే వారం మళ్లీ గంభీర్ .. ఇంగ్లండ్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.