KCA : భారత మాజీ పేసర్ శ్రీశాంత్ (S Shreesanth) మరోసారి చిక్కుల్లో పడ్డాడు. గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా ఆటకు దూరమైన ఈ స్పీడ్‌గన్ ఈసారి సంజూ శాంసన్(Sanju Samson)కు మద్ధతుగా నిలిచినందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. కేరళ క్రికెట్ సంఘం (KCA) అతడిపై మూడు ఏళ్లు నిషేధం విధించింది. ఈ సమయంలో కేరళ క్రికెట్‌కు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనరాదని శ్రీశాంత్‌ను కేసీఏ ఆదేశించింది.
క్రికెట్ సంఘంపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు, ప్రతిష్ట దెబ్బతీసేందుకు ప్రయత్నించాడనే కారణంతో శ్రీశాంత్‌పై వేటు వేసింది కేసీఏ. అసలేం జరిగిందంటే..? ఈమధ్యే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో సంజూ శాంసన్ భారత స్క్వాడ్‌కు ఎంపికవ్వలేదు. దాంతో, తమ రాష్ట్రానికి చెందిన శాంసన్‌కు అన్యాయం జరిగిందంటూ శ్రీశాంత్ వాపోయాడు. అంతటితో ఊరుకోకుండా కేరళ క్రికెట్ సంఘంపైనా ఆరోపణలు చేశాడు. కేసీఏ చేతకానితనం వల్లనే శాంసన్‌కు భారత స్క్వాడ్‌లో చోటు దక్కలేదని మండిపడ్డాడు. దాంతో, అతడి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కేసీఏ కోరింది.
🚨 Kerala Cricket Association suspends Sreesanth for 3 years over Sanju samson Controversy 🚨
The KCA also said that it will seek legal action for compensation from Sanju’s father, Samson Viswanath, Reji Lukose and 24 news channel anchor for making “baseless allegations against… pic.twitter.com/S1ytkB8kBq
— Mohit Kamal Rath (@mkr4411) May 2, 2025
అందుకు శ్రీశాంత్ బదులిచ్చినా క్రికెట్ సంఘం పెద్దలు శాంతించలేదు. ‘శ్రీశాంత్ ఇచ్చిన వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. భారత స్క్వాడ్‌లో శాంసన్‌కు చోటు దక్కలేదని అతడు మమ్మల్ని విమర్శించాడు. శ్రీశాంత్‌తో పాటు మరికొందరికి మేము నోటీసులు పంపాం. క్రికెట్ సంఘంపై తప్పుడు ఆరోపణలు చేసిన శ్రీశాంత్‌పై మూడేళ్ల నిషేధం విధించాలని తీర్మానించాం’ అని కేసీఏ అధికారి వినోద్ కుమార్ వెల్లడించాడు.
శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి(Bhuvaneshwari Kumari) తమకు సస్పెన్షన్ గురించిన సమాచారం తెలియజేయలేదని అంటోంది. టీవీల్లో చూసి తాము ఈ విషయం తెలుసుకున్నామని ఆవిడ చెప్పింది. శ్రీశాంత్ ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్‌లోని ఏరిస్ కొల్లాం సెయిలర్స్(Aries Kollam Sailors) ఫ్రాంచైజీకి సహ యజామనిగా కొనసాగుతున్నాడు. ఈ కేరళ మాజీ క్రికెటర్ 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ గెలుపొందిన భారత జట్టులో సభ్యుడు. 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20ల్లో శ్రీశాంత్ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు.
‘In the air… Sreesanth takes it’#OnThisDay in 2007, India became the inaugural @T20WorldCup champions with a thrilling five-run win over Pakistan in Johannesburg 🇮🇳🏆 pic.twitter.com/ZonOloUXD3
— ESPNcricinfo (@ESPNcricinfo) September 24, 2020