Team India : క్రీడా చరిత్రలో అరుదైన ఘట్టం అవిష్కృతమైంది. మైదానంలో బ్యాటుతో బంతితే చెలరేగే క్రికెటర్లు.. చిరుతల్లా కదిలే ఫుట్‌బాలర్లు ఒక్కచోట చేరారు. నాలుగో టెస్టుకుమ్యాచ్కు ఇంకా మూడు రోజులు ఉండడంతో ఆదివారం అడిడాస్ (Adidas) సంస్థ ఫొటోషూట్ ఏర్పాటు చేసింది. స్థానిక మాంచెస్టర్ యునైటెడ్ (Manchester United) ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్లతో కలిసి టీమిండియా ఆటగాళ్లు ఫొటోలు దిగారు. ఇరువురు తమతమ జెర్సీలు మార్చుకోవడం విశేషం. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాంచెస్టర్ సారథి బ్రునో ఫెర్నాండేజ్ (Bruno Fernandes) జెర్సీ ధరించగా.. గిల్ టెస్టు జెర్సీతో బ్రునో మురిసిపోయాడు.
లార్డ్స్ టెస్టులో అనూహ్య ఓటమితో సిరీస్‌లో వెనుకంజ వేసిన భారత జట్టు ఓల్డ్ ట్రఫొర్డ్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇప్పటికే మాంచెస్టర్ సిటీకి చేరుకున్న గిల్ సేన నెట్స్‌లో చెమటోడ్చుతోంది. అయితే.. ఆదివారం ఆటవిడుపుగా టీమిండియా స్పాన్సర్‌గా ఉన్న అడిడాస్ సంస్థ స్థానిక ఫుట్‌బాల్ జట్టుతో ఫొటోషూట్ ఏర్పాటు చేసింది.
ఫుట్‌బాల్, క్రికెట్ స్టార్లు ఒక్కచోట.. జెర్సీలు మార్చుకొని పోజిచ్చారిలా.! ఫుట్‌బాల్, క్రికెట్ స్టార్లు ఒక్కచోట.. జెర్సీలు మార్చుకొని పోజిచ్చారిలా.! అయితే.. ఫుట్‌బాలర్లు, మన క్రికెటర్లు పరస్పరం జెర్సీలు మార్చుకొని దిగడంతో ఈ ఫొటో ప్రత్యేకమైనది నిలిచిపోనుంది. క్రికెట్, ఫుట్‌బాల్ స్టార్లు చిరు నవ్వులు చిందుస్తున్న ఈ ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఇరుజట్ల అభిమానులు అయితే ఈ ఆరుదైన ఫొటో చూసి సంతోషంలో మునిగితేలుతున్నారనుకో.
కొత్త సారథి శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇంగ్లండ్ పర్యటన సవాల్ విసురుతోంది. తొలి టెస్టులో పరాజయం తర్వాత సంచలన ఆటతో స్టోక్స్ బృందానికి చెక్ పెట్టింది టీమిండియా. అదే జోరును లార్డ్స్‌లోనూ చూపించినా.. 193 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక చతికిలపడింది. ప్రధాన బ్యాటర్లు విఫలమవ్వగా.. టెయిలెండర్లతో కలిసి రవీంద్ర జడేజా (62నాటౌట్) చేసిన ఒంటరి పోరాటమంతా వృథా అయ్యింది. 2-1తో సిరీస్‌లో వెనకబడిన గిల్ సేన ఓల్ట ట్రఫోర్డులో సమిష్టిగా రాణించి సిరీస్ సమం చేయాలనుకుంటోంది. అయితే.. ఓల్ట్ ట్రఫోర్డ్‌లో భారత్ గత తొమ్మిది మ్యాచుల్లో ఒక్కటీ గెలవలేదు. నాలుగింట ఇంగ్లండ్ గెలుపొందగా 5 మ్యాచులు డ్రాగా ముగిశాయి.