భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఓవల్ స్టేడియంలో 1971 తర్వాత ఇంగ్లండ్‌ను ఓడించి.. తొలి టెస్ట్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 157 పరుగులతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంతో ఇండియా రికార్డు క్రియేట్ చేసింది.
భారత్ నిర్ధేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఇంగ్లండ్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 157 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 290 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ 466 పరుగులు చేసి.. ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే.. ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 210 పరుగులే చేసి కుప్పకూలిపోయింది.
నాలుగో టెస్ట్ మ్యాచ్ చివరి రోజున టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. 18.2 ఓవర్లు వేసి ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీయగా.. 22 ఓవర్లలో బుమ్రా 2 వికెట్లు, జడెజా 2 వికెట్లు, శార్దూల్ 2 వికెట్లు తీసి టీమిండియాకు విజయాన్ని అందించారు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో 127 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
For his fantastic 127 in the second innings, Rohit Sharma is named the Player of the Match 🌟#WTC23 | #ENGvIND pic.twitter.com/owfPgp05Xv
— ICC (@ICC) September 6, 2021
ఐదు టెస్ట్ మ్యాచ్‌లలో భాగంగా.. ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక.. మిగిలిన ఐదో టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 10న మాంచెస్టర్‌లో జరగనుంది.
THIS. IS. IT! 👏 👏
— BCCI (@BCCI) September 6, 2021
Take a bow, #TeamIndia! 🙌 🙌
What a fantastic come-from-behind victory this is at The Oval! 👌 👌
We head to Manchester with a 2-1 lead! 👍 👍 #ENGvIND
Scorecard 👉 https://t.co/OOZebP60Bk pic.twitter.com/zhGtErWhbs