India Vs SA ODI | రాంచీలో జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా సారధి శిఖార్ ధావన్ మరోమారు విఫలం అయ్యాడు. 279 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సిన టీం ఇండియా బ్యాట్స్మన్లు దూకుడుగా ముందుకెళ్లలేకపోతున్నారు. తొలి వన్డేలో మాదిరిగానే రెండో వన్డేలోనూ శిఖార్ ధావన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి శిఖార్ ధావన్ వ్యక్తిగత స్కోర్ 13 పరుగులు. టీం ఇండియా స్కోర్ 28 పరుగులుగా నమోదైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. 40 ఓవర్లకే ఓపెనర్లు (క్వింటాన్ డికాక్ 5, జన్నేమాన్ మలాన్ 25) పెవిలియన్ బాట పట్టడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను రీజా హెండ్రిక్స్, అడైన్ మార్క్రమ్ చేపట్టారు. మూడో వికెట్ భాగస్వామ్యానికి 129 పరుగులు జత చేశారు. రీజా హెండ్రిక్స్ 74, అడెన్ మార్క్రమ్ 79 పరుగులతో జట్టును ఆదుకున్నారు.