దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో అనుభవలేమితో ఉన్న భారత పేస్ బౌలింగ్ యూనిట్‌కు మరో ఎదురుదెబ్బ. టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్.. సోమవారం దుబాయ్ నుంచి హుటాహుటిన దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. అతడి తండ్రి ఆల్బర్ట్ కన్నుమూయడంతో మోర్నీ ఉన్నఫళంగా సౌతాఫ్రికా వెళ్లాల్సి వచ్చింది.
బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో షమీ నేతృత్వంలో బరిలోకి దిగబోయే భారత జట్టులో కుర్రాళ్లు హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ రాణాకు మోర్నీ దిశానిర్దేశం చేస్తాడని భావిస్తున్న తరుణంలో అతడు సౌతాఫ్రికాకు వెళ్లడం భారత్‌ను ఇబ్బందులకు గురిచేసేదే.