చెన్నై: రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా(Team India) ప్రిపరేషన్ మొదలుపెట్టింది. బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం.. భారత బృందం చెన్నై చేరుకున్నది. నెల రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ టాప్ క్రికెటర్లు .. ప్రాక్టీస్ షురూ చేశారు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి చెన్నైలో తొలి మ్యాచ్ ప్రారంభంకానున్నది. రోహిత్, విరాట్ కోహ్లీ.. ఎంఏ చిదంబరం స్టేడియంకు చేరుకున్నారు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు.
బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్లో ట్రైనింగ్‌కు చెందిన ఫోటోను పోస్టు చేసింది. రసవత్తరమైన హోం సీజన్ కోసం టీమిండియా కౌంట్‌డౌన్ మొదలైనట్లు ఆ ట్వీట్లో పేర్కొన్నది. గురువారమే రోహిత్ శర్మ చెన్నై చేరుకున్నడు. ఇవాళ ఉదయం లండన్ నుంచి కోహ్లీ వచ్చేశాడు. బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కూడా గురువారమే వచ్చేశారు. కోచ్ గంభీర్‌తో పాటు అతని సపోర్ట్ స్టాఫ్‌కు ఇది తొలి టెస్టు సిరీస్ కానున్నది.
The countdown starts as #TeamIndia begin their preps for an exciting home season.#INDvBAN pic.twitter.com/VlIvau5AfD
— BCCI (@BCCI) September 13, 2024