Cricketers – NADA TEST : ఈ ఏడాది నాడా నిర్వహించిన డోపింగ్ టెస్టు(Doping Test)లో భారత జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటివరకూ అతడిపై అత్యధికంగా మూడు సార్లు డోప్ పరీక్షలు నిర్వహించారు. అయితే.. ఆశ్చర్యకరంగా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli), కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై మాత్రం ఒక్కసారి కూడా డోపింగ్ టెస్టు చేయలేదు. ఈ ఏడాది తొలి ఐదు నెలల డోపింగ్ టెస్టు రికార్డులను నాడా తాజాగా వెల్లడించింది.
అందులో పురుష, మహిళా క్రికెటర్లు కలిపి మొత్తం 55 మందకి డోపింగ్ టెస్టు నిర్వహించినట్టు తెలిపింది. అయితే.. వీటిలో సగం వరకు పరీక్షలను ముందస్తు జాగ్రత్తగా జరిపినట్టు నాడా చెప్పింది. భారత క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లపై కూడా డోప్ పరీక్షలు జరిపారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు జడేజా 3 సార్లు డోప్ టెస్టు చేయించుకున్నాడు. హిట్‌మ్యాన్ నిరుడు అత్యధికంగా ఐదు డోపింగ్ టెస్టులు చేయించుకున్న విషయం తెలిసిందే.
భారత క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లకు కూడా డోపింగ్ పరీక్షలు జరిపారు. వీళ్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023) 16వ సీజన్లో ఆడేందుకు వచ్చినవాళ్లే ఉన్నారు. ఇంతకు వాళ్లు ఎవరంటే..? ఆండ్రూ రస్సెల్(Andre Russell), డేవిడ్ వార్నర్(David Warner), సునీల్ నరైన్, కామెరూన్ గ్రీన్, మార్కస్ స్కోయినిస్, మార్క్ వుడ్, ఆడం జంపా, డేవిడ్ మిల్లర్, డేవిడ్ వీస్, సామ్ కరన్, ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, లియాం లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్ తదితరులకు డోప్ పరీక్షలు చేశారు.
డేవిడ్ వార్నర్
నాడా ఈ ఏడాది ఇప్పటికే 58 శాంపిల్స్ తీసుకుంది. వీటిలో 51 మూత్ర నమూనాలు కాగా ఏడు మాత్రం రక్త నమూనాలు. దాంతో, గత రెండేళ్లతో పోల్చితే ఈసారి డోపింగ్ టెస్టుల పెరిగే అవకాశం ఉంది. 2021లో 54, 2022లో 60 మంది క్రికెటర్ల దగ్గర శాంపిల్స్ తీసుకున్నారు. మామాలుగా అయితే.. యోయో టెస్టు(Yo-Yo test) పాసవ్వడం కోసం కొందరు క్రికెటర్లు నిషేధిత డ్రగ్స్ తీసుకుంటారు. కానీ, క్రికెటర్లను డోపింగ్ టెస్టుల కిందకు తీసుకొచ్చినప్పటి నుంచి చాలా మార్పు కనిపిస్తోంది. నాడా తరచూ డోపింగ్ టెస్టులు నిర్వహిస్తూ క్రికెటర్లను ప్రమాదకరమైన డ్రగ్స్ బారిన పడకుండా చూస్తోంది.