The Hundred League 2023 : ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ పురుషుల లీగ్(The Hundred League 2023) మూడో సీజన్లో సంచలనం నమోదైంది. ఈ వంద బంతుల మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్(Spencer Johnson) అరుదైన ఫీట్‌తో రికార్డు సృష్టించాడు. 20 బంతులకు 19 డాట్ బాల్స్ వేసి చరిత్రకెక్కాడు. అతను అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇంత గొప్ప బౌలింగ్ ప్రదర్శన చేయడం విశేషం. ఒవల్ ఇన్విన్సిబుల్(Oval Invincibles) జట్టు తరఫున ఆడినస్పెన్సర్ మాంచెస్టర్ ఒరిజినల్స్(Manchester Originals) జట్టుపై ఈ ఫీట్ సాధించాడు.
తన 20 బంతులస్పెల్లో ఈ పేసర్ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ ఒక్క పరుగు కూడా విధ్వసంక ఆటగాడు జోస్ బట్లర్(Jos Buttler) తీశాడు. దాంతో, ది హండ్రెడ్ లీగ్‌లో స్పెన్సర్ 20-19-1-3తో అత్యుత్తమ గణాంకాలు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ఒవల్ ఇన్విన్సిబుల్ జట్టు 94 పరుగుల తేడాతో గెలుపొందింది.
Spencer Johnson’s 3️⃣ wickets 🔥#TheHundred pic.twitter.com/kyQwS35BOC
— The Hundred (@thehundred) August 9, 2023
పాకిస్థాన్ పేసర్ ఇహ్షానుల్లా(Ihsanullah) స్థానంలో స్పెన్సర్ జాన్సన్ జట్టులోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే తన సూపర్ స్పెల్‌తో మాంచెస్టర్ ఒరిజినల్స్ నడ్డి విరిచాడు. అతడి ధాటికి ఆ జట్టు 92 పరగులకే కుప్పకూలింది. మొదట బ్యాటింగ్ చేసిన ఒవల్ వంద బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆ తర్వాత స్పెన్సర్ దెబ్బకు ఆ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అతను ఉస్మా మిర్(1), టామ్ హర్ట్లే(0), జోషు లిటిల్(0) వికెట్లు తీయడంతో 92 రన్స్‌కే పరిమితమైంది.