Shreyas Iyer | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఓపెనర్లు శుభ్‌మన్‌గిల్, రోహిత్‌శర్మ, వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఔట్ అవడంతో కష్టాల్లో చిక్కుకున్నది. తాజాగా శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ వెంటవెంటనే ఔట్ కావడంతో నిర్దేశిత పరుగుల సాధనలో తడబడుతున్నది. న్యూజిలాండ్ బౌలర్లు ఆచితూచీ పొదుపుగా పరుగులు ఇస్తుండటంతో టీమ్ ఇండియా వెనకబడుతున్నది. రోహిత్ శర్మ ఔటైన తర్వాత అక్షర్ పటేల్‌తో కలిసి స్కోర్ పెంచేందుకు ప్రయత్నిస్తున్న శ్రేయాస్ అయ్యర్.. మిచెల్ శాంత్నర్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. అప్పటికి శ్రేయాస్ అయ్యర్ 48 పరుగులు (రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు) చేశాడు. ఆ వెంటనే అక్షర్ పటేల్ రూపంలో టీమ్ ఇండియా మరో వికెట్ కోల్పోయింది. మిచెల్ బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో ఓ రూర్కేకు క్యాచ్ ఇచ్చి 29 పరుగుల వద్ద అక్షర్ పటేల్ అవుటయ్యాడు.