దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ(ChampionsTrophy)లో బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహిద్ హృదయ్.. విరోచిత సెంచరీ చేశాడు. భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. 100 రన్స్ చేసి అతను ఔట్ అయ్యాడు. తౌహిద్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. పేస్ బౌలర్ మహమ్మద్ షమీ .. ఈ మ్యాచ్‌లో అయిదు వికెట్లు తీసుకున్నాడు. వేగంగా వన్డేల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా అతను రికార్డు క్రియేట్ చేశాడు.
2⃣0⃣0⃣ wickets and counting!
Mohd. Shami becomes the fastest bowler for India to scalp 200 ODI wickets! 🫡
Follow the Match ▶️ https://t.co/ggnxmdG0VK#TeamIndia | #BANvIND | #ChampionsTrophy | @MdShami11 pic.twitter.com/CqLyuQPh3X
— BCCI (@BCCI) February 20, 2025
ఓ దశలో బంగ్లాదేశ్ 35 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. అయితే తౌహిద్, జాకిర్లు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇద్దరూ ఆరో వికెట్‌కు 154 రన్స్ జోడించారు. జాకిర్ 68 రన్స్ చేసి ఔట్ అవ్వగా.. తౌహిద్ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. వన్డేల్లో తౌహిద్‌కు ఇది ఫస్ట్ సెంచరీ కావడం విశేషం. తీవ్రంగా గాయమైనా.. అతను బ్యాటింగ్‌ను కొనసాగించాడు. చివర్లో అతను పరుగులు తీయడం కష్టమైంది. క్రీజ్‌లో పరుగు తీయడానికి ఇబ్బందిపడ్డాడు. సింగిల్ రన్ కోసం నడుచుకుంటూ వెళ్లాడు. కానీ తౌహిద్ తన ఇన్నింగ్స్‌తో బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.
Maiden ODI 💯 for Bangladesh’s Tawhid Hridoy and what an occasion to bring it up 👏#ChampionsTrophy #BANvIND ✍️: https://t.co/zafQJUBu9o pic.twitter.com/zgkUwb4MXy
— ICC (@ICC) February 20, 2025
తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు .. భారత బౌలర్లు షాక్ ఇచ్చారు. తొలి రెండు ఓవర్లలోనే ఆ జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. ఇక అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ దక్కే ఛాన్సు మిస్సైంది. రోహిత్ శర్మ ఓ క్యాచ్‌ను విడిచిపెట్టడంతో.. అక్షర్ హ్యాట్రిక్ తీసుకునే అవకాశాన్ని కోల్పోయాడు. షమీ 10 ఓవర్లలో 53 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.
He is BACK and HOW 🤩
𝗙𝗜𝗙𝗘𝗥 for Mohd. Shami against Bangladesh!
Follow the Match ▶️ https://t.co/ggnxmdG0VK#TeamIndia | #BANvIND | #ChampionsTrophy | @MdShami11 pic.twitter.com/sX0dT9cCbp
— BCCI (@BCCI) February 20, 2025