IPL | న్యూఢిల్లీ: జెడ్డా(సౌదీ అరేబియా) వేదికగా ఈనెల 24, 25 తేదీల్లో జరుగనున్న ఐపీఎల్ వేలంలో మొత్తం 574 మంది ప్లేయర్లు రాబోతున్నారు. ఇందులో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్‌సింగ్ లాంటి స్టార్ క్రికెటర్లు 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి ప్రవేశిస్తున్నారు. బీహార్‌కు చెందిన అండర్-19 క్రికెటర్ 13 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ అతిపిన్న వయసు క్రికెటర్‌గా వేలంలోకి వస్తున్నాడు.
తొలుత 1574 మంది ప్లేయర్లు వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా, ఇందులో నుంచి 574 మందితో బీసీసీఐ శుక్రవారం తుది జాబితాను ప్రకటించింది. ఇందులో 366 మంది భారత ప్లేయర్లు కాగా మిగిలిన 208 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. 81 మంది ప్లేయర్లు 2కోట్ల కేటగిరీలో 27 మంది 1.5 కోట్ల విబాగంలో, 18 మంది 1.25 కోట్ల, 23 మంది 1 కోటి విభాగంలో ఉన్నారు.