BAN vs PAK : ఆసియ కప్‌లో శ్రీలంకకు చెక్ పెట్టిన బంగ్లాదేశ్ సూపర్ -4 రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను వణికించింది. స్పిన్నర్ రిషద్ హొసేన్ (2-18), పేసర్ తస్కిన్ అహ్మద్(3-28)ల విజృంభణతో పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. బంగ్లా బౌలర్లు, ఫీల్డర్లు కట్టడి చేయడంతో పవర్ ప్లేలో 27 రన్స్ మాత్రమే చేసింది. 49 పరుగులకే సంగం వికెట్లు కోల్పోయిన జట్టును మొహమ్మద్ హ్యారిస్ (31), నవాజ్ (25) ఆదుకున్నారు. ఈ ఇద్దరి కీలక ఇన్నింగ్స్‌తో కోలుకున్న పాక్ నిర్ణీత ఓవర్లలో 135 రన్స్ చేసింది.
టాస్ ఓడిన పాకిస్థాన్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. తస్కిన్ తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫర్హాన్(4)ను ఔట్ చేసి వికెట్ల వేటకు తెరతీశాడు. ఆ తర్వాత హసన్ వేసిన ఓవర్లో సయీం ఆయూబ్ డకౌట్‌గా ఔటయ్యాడు. దాంతో.. ఆ జట్టు పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 27 రన్స్ చేసింది. కెప్టెన్ సల్మాన్ అఘా(19)తో కలిసి జట్టును ఆదుకోవాలనుకున్న ఫఖర్ జమాన్(13)ను రిషద్ హొసేన్ ఔట్ చేసి పాకిస్థాన్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. గత మ్యాచ్‌లో శ్రీలంకపై కీలక ఇన్నింగ్స్ ఆడిన తలాటి(3) సైతం రివర్స్ స్వీప్ ఆడబోయి హోసెన్ చేతికి చిక్కాడు. అంతే 33కే నాలుగు వికెట్లు పడ్డాయి.
Bangladesh Need 136 Runs to Win | Bangladesh 🇧🇩 🆚 Pakistan 🇵🇰 | Match 17 | Super Four | Asia Cup 2025
25 September 2025 | 8:30 PM | Dubai International Cricket Stadium#Bangladesh #TheTigers #BCB #Cricket #AsiaCup #Cricket #TigersForever #AsiaCup2025 pic.twitter.com/WrhUzHRjGs
— Bangladesh Cricket (@BCBtigers) September 25, 2025
ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో సల్మాన్ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. 49కే సగం వికెట్లు కోల్పోయిన వేళ అఫ్రిది(19) రెండు సిక్సర్లతో జట్టు స్కోర్ వేగం అందుకుంది. అయితే.. తస్కిన్ ఓవర్లో మరో పెద్ద షాట్‌కు ఆడి టైమింగ్ కుదరక కీపర్ అలీ చేతికి దొరికాడు. దాంతో, ఆరో వికెట్ 38 రన్స్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం మొహమ్మద్ హ్యారిస్(31), నవాజ్(25)లు చకచకా డబుల్స్ తీస్తూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోర్ వంద దాటించారు. కానీ.. హసన్ రిటర్న్ క్యాచ్‌తో హ్యారిస్‌ను వెనక్కి పంపాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్లో ఫర్హాన్(14) ఒక్కడే రాణించడంతో పాక్ 135కు పరిమితమైంది.