Tanveer Sangha : స్వదేశంలో చెలరేగిపోయి వన్డే సిరీస్ పట్టేసిన ఆస్ట్రేలియా పొట్టి సిరీస్‌పైనా కన్నేసింది. అక్టోబర్ 29న భారత జట్టుతో మొదలయ్యే టీ20 సిరీస్ కోసం పకడ్బందీగా బరిలోకి దిగుతోంది ఆతిథ్య జట్టు. అయితే.. కుటుంబ కారణాలతో ప్రధాన స్పిన్నర్ ఆడం జంపా (Adam Zampa) సిరీస్‌కు దూరం అవ్వాల్సి వచ్చింది. అందుకని అతడి స్థానంలో భారత సంతతి క్రికెటర్‌ను తీసుకున్నారు. లెగ్ స్పిన్నర్ అయిన తన్వీర్ సంఘా(Tanveer Sangha)ను స్క్వాడ్‌లోకి ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఈ విషయాన్నిసోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
ఆడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో నాలుగు వికెట్లతో టీమిండియాను దెబ్బకొట్టిన ఆడం జంపా టీ20 లోనే తిప్పేయాలనుకున్నాడు. కానీ, అతడి భార్య హ్యారిట్ రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. దాంతో.. అతడు సిరీస్‌కు అందుబాటులో ఉండడని సెలెక్టర్లకు చెప్పాడు. దాంతో.. తన్వీర్ సంఘాకు అవకాశం లభించింది. 23 ఏళ్ల తన్వీర్.. బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీథండర్స్ తరఫున అదరగొట్టాడు. ఇదివరకే ఈ కుర్రాడు ఏడు అంతర్జాతీయ టీ20లు కూడా ఆడాడు. అరంగేట్రం మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 31 రన్స్‌కే నాలుగు వికెట్లతో చెలరేగాడు. అయితే.. 2023లో చివరిసారిగా ఆసీస్ జెర్సీ వేసుకున్నాడు తన్వీర్.
Adam Zampa is unavailable for the start of the T20I series against India due to personal reasons 🔁
Full story: https://t.co/gzbopdDgHZ pic.twitter.com/llN7mJW3np
— ESPNcricinfo (@ESPNcricinfo) October 27, 2025
తన్వీర్ క్రికెటింగ్ జర్నీ ఆసక్తికరంగా మొదలైంది. సిడ్నీలో స్థిరపడిన భారత కుటుంబం వీళ్లది. అతడు చిన్నప్పుడు ఫాస్ట్ బౌలర్ అవ్వాలనుకున్నాడు. కానీ, టీనేజ్‌లో లెగ్ స్పిన్ మీద ఆసక్తితో బంతిని గింగిరాలు తిప్పడం సాధన చేశాడు. న్యూ సౌత్‌వేల్స్, యూత్ జట్లకు ఆడిన తన్వీర్‌కు బంతి మీద పూర్తి నియంత్రణ ఉండడమే కాదు.. వేగంగా టర్న్ చేయగలడు కూడా. రెండేళ్ల తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన తన్వీర్ ఈసారి భారత బ్యాటర్లను ఏమేరకు ఇబ్బంది పెడుతాడో చూడాలి.
ఆస్ట్రేలియా స్క్వాడ్ : మిచెల్ మార్ష్(కెప్టెన్), సీన్ అబాట్(1-3 మ్యాచ్‌లు), గ్జావియర్ బార్ట్లెట్, మహ్లీ బీయర్డ్మన్(3-5 మ్యాచ్‌లు), టిమ్ డేవిడ్, బెన్ ద్వారుషి(4-5 మ్యాచ్‌లు), నాథన్ ఎల్లిస్, హేజిల్‌వుడ్(1-2 మ్యాచ్‌లు), మ్యాక్స్‌వెల్(3-5 మ్యాచ్‌లు), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), కుహ్నేమన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్పే(వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, స్టోయినిస్, తన్వీర్ సంఘా.
Tanveer Sangha returns to the Aussie T20I squad! The legspinner steps in for Adam Zampa. Fresh off a strong domestic run, Sangha could team up with Matt Kuhnemann in a twin-spin attack. Can the young gun make an impact against India?#TanveerSangha | #DontStopStreaming | #tapmad pic.twitter.com/X4qHK0vxRj
— tapmad (@tapmadtv) October 27, 2025