Irani Cup 2024 : దేశవాళీ క్రికెట్లో రికార్డు స్థాయిలో 42వ సారి రంజీ ట్రోఫీ గెలుపొందిన ముంబై (Mumbai) 27 ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. బ్యాటర్లతో పాటు బౌలర్ల అసమాన పోరాటంతో ముంబై ఎట్టకేలకు ఇరానీ కప్‌లో చాంపియన్‌గా అవతరించింది. రెండో ఇన్నింగ్స్‌లో తనుష్ కొతియాన్ (114 నాటౌట్) సంచలన ఆటతో రెస్టాఫ్ ఇండియా(Rest Of India) గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన ముంబైని విజేతగా ప్రకటించారు. దాంతో. ఆ జట్ట మొత్తంగా 15వ సారి ఇరానీ కప్‌ను హస్తగతం చేసుకుంది.
లక్నో వేదికగా రసవత్తరంగా సాగిన ఇరానీ కప్‌లో ముంబై మురిసింది. రంజీ ట్రోఫీలో రారాజు అయిన ఆ ఆజట్టు 27 ఏండ్ల తర్వాత తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. సర్ఫరాజ్ ఖాన్(222) డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ కొట్టిన ముంబై ఆ తర్వాత ప్రత్యర్థిని తక్కువకే ఆలౌట్ చేసింది. అభిమన్యు ఈశ్వరన్(155), ధ్రువ్ జురెల్(93)లు ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొని జట్టును గట్టెక్కించారు. అయితే.. షామ్స్ ములానీ(3/122), తనుష్ కొతియాన్(3/101)ల విజృంభణతో రెస్టాఫ్ ఇండియా ఇన్నింగ్స్ 416 వద్దే ముగిసింది. దాంతో, అజింక్యా రహానే సేనకు 121 పరగులు ఆధిక్యం లభించింది.
𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒! 🏆
Presenting the winners of #IraniCup 2024 👉 𝐌𝐮𝐦𝐛𝐚𝐢! 🏆 👍@IDFCFIRSTBank | @MumbaiCricAssoc pic.twitter.com/rbRhrth0iX
— BCCI Domestic (@BCCIdomestic) October 5, 2024
కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో ముంబై తడబడింది. రెస్టాఫ్ ఇండియా స్పిన్నర్ సరన్ష్ జైన్(6/126) ధాటికి టాప్ ఆటగాళ్లంతా డగౌట్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ పృథ్వీ షా(76) అర్ధ సెంచరీతో మెరిసినా మిగతావాళ్లను సరన్ష్ క్రీజులో నిలబడనివ్వలేదు. దాంతో, 171 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఆలౌట్ ప్రమాదంలో పడింది.
𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐚𝐫𝐞 𝐭𝐡𝐞 #𝐈𝐫𝐚𝐧𝐢𝐂𝐮𝐩 𝐰𝐢𝐧𝐧𝐞𝐫𝐬 👏 👏
Mohit Avasthi gets his 50. Tanush Kotian remains unbeaten on 114. The players shake hands 🤝
The match ends in a draw & Mumbai win the trophy by virtue of taking first-innings lead 🙌#IraniCup | @IDFCFIRSTBank pic.twitter.com/0GTKkAdU6m
— BCCI Domestic (@BCCIdomestic) October 5, 2024
ఆ పరిస్థితుల్లో తనుష్ కొతియాన్(114 నాటౌట్) అద్భుత పోరాటపటిమ చూపించాడు. మోహిత్ అవస్థి(51 నాటౌట్) అండగా రెస్టాఫ్ ఇండియా బౌలర్లను విసిగిస్తూ సూపర్ సెంచరీ సాధించాడు. అంతేకాదు.. ఆఖరి ఓవర్‌దాకా నిలబడి మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. తనుష్ పోరాటంతో ఐదో రోజు ఆట ముగిసే సరికి ముంబై 8 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం కారణంగా ముంబై చాంపియన్‌గా నిలిచింది.