ఎలిగేడు, సెప్టెంబర్ 8 : పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికితను రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఇటీవల కెనడాలోజరిగిన ఆర్చరీ యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత ప్లేయర్‌గా చికిత అరుదైన ఘనత సాధించింది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో సీఎంను స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన చికితను ఆయన శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.
ఆనంతరం సీఎం మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో పతకం సాధించేలా ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి రాజేందర్రావు తదితరులు పాల్గొన్నారు.