Mumbai | కోయంబత్తూరు: భారత జట్టుకు ఆడే స్టార్ క్రికెటర్లు తలపడుతున్న బుచ్చిబాబు టోర్నమెంట్లో ముంబై ఎదుట తమిళనాడు 510 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్లో 379 రన్స్ చేసిన తమిళనాడు రెండో ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌట్ అయింది.
అంతకుముందు ముంబై ఫస్ట్ ఇన్నింగ్స్లో 156 పరుగులకే చేతులెత్తేసింది. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ వంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్న ముంబై మూడో రోజు ఆటముగిసే సమయానికి 6/0 పరుగులు చేసింది.