ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup) షెడ్యూల్ విడుదలైంది. యూఏఈ వేదికగా జరిగిన గత టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రపంచకప్లో టీమిండియా సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా 2022 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబరు 16 నుంచి తొలి రౌండ్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 22న సూపర్-12 స్టేజ్ మ్యాచులు ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్లో ప్రపంచకప్ నిర్వహిస్తున్న ఆస్ట్రేలియా.. న్యూజిల్యాండ్తో తలపడనుంది.
భారత జట్టు తన తొలి మ్యాచ్ అక్టోబరు 23న ఆడుతుంది. ఈసారి కూడా ఈ మెగాటోర్నీలో భారత్ తలపడే తొలి ప్రత్యర్థి దాయాది పాకిస్తానే కావడం గమనార్హం. అయితే గతంలో కోహ్లీ సారధ్యంలో బరిలో దిగిన భారత జట్టు ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడుతుంది.