సమర్కండ్ (ఉజ్బెకిస్థాన్): చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు వరుసగా నాలుగో విజయం సొంతం చేసుకున్నాయి. శనివారం జరిగిన ఓపెన్ సెక్షన్ నాలుగో రౌండ్లో భారత పురుషుల జట్టు 3-1తో స్పెయిన్‌ను ఓడించింది. వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్, భారత నంబర్ వన్ ఆటగాడు ఇరిగేశి అర్జున్ తమ ప్రత్యర్థులపై అద్భుత విజయాలు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మహిళల విభాగంలో భారత్.. మంగోలియాను చిత్తు చేసింది.