హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ యువ ఆటగాడు జతిన్ దేవ్ స్వర్ణ పతకం గెలిచాడు. అండర్-19 బాలుర విభాగంలో చాంపియన్గా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో జతిన్ 11-8,15-13, 8-11,12-10,12-10తో హ్రియాన్పై విజయం సాధించాడు.