హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ షో జంపింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ యువ రైడర్ మహమ్మద్ హాషమ్ సత్తా చాటాడు. నాసర్ పోలో – ఈక్వెస్ట్రియన్ అకాడమీ వేదికగా శనివారం మొదలైన ఈ టోర్నీలో హాషమ్ 115-120 సెం.మీ షో జంపింగ్ ఓపెన్ కేటగిరీలో విజేతగా నిలిచాడు. ది అశ్వ కలెక్టివ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి కాని కాంగ్ గుర్రంపై అద్భుత ప్రదర్శన చేసిన అతను అగ్రస్థానం అందుకున్నాడు. కోవై స్టేబుల్స్ జట్టు రైడర్ స్నేథిల్ రన్నరప్‌గా నిలిచాడు.