T20 World Cup | టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి శకం ముగిసింది. ఆయన స్థానంలో మరో దిగ్గజం రాహుల్ ద్రవిడ్.. జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. ఈ క్రమంలో ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ, కొత్త రోహిత్ శర్మ ఇద్దరూ కలిసి రవిశాస్త్రికి ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.
భారత్‌కు ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఎన్నో మరపురాని విజయాలందించిన సంగతి తెలిసిందే. టీమిండియా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గిరీష్ డోంగ్రే షేర్ చేసిన ఫొటోల్లో రవిశాస్త్రికి ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఇచ్చిన గిఫ్ట్ బయటపడింది. ఇంతకీ వాళ్లు ఇచ్చిన బహుమతులు ఏంటో తెలుసా?
జట్టుకు ఎన్నో విజయాలు అందించిన తమ బ్యాట్లను రవిశాస్త్రికి గిఫ్ట్‌గా ఇచ్చారీ ప్లేయర్స్. రెండు చేతుల్లో రెండు బ్యాట్లతో రవిశాస్త్రి ఉన్న ఫొటోను గిరీష్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. నెటిజన్లంతా ఈ ఫొటోలను చూసి రోహిత్, కోహ్లీ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.
Virat Kohli and Rohit Sharma gifted their bat to Ravi Shastri. pic.twitter.com/rjSd5qvfFU
— Johns. (@CricCrazyJohns) November 9, 2021