క్రికెట్లో చాలా ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. ఈరోజే మొదలైన టీ20 ప్రపంచకప్లో జరిగిన ఘటన కూడా అలాంటిదే. యూఏఈ, నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ జట్టు సభ్యుడు ఆయన్ అఫ్జల్ ఖాన్.. ప్రపంచకప్లో ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
అంతేకాదు, ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో ఫెయిలైన అతను.. అవుటై తిరిగి వెళ్తూ వెళ్తూ బౌండరీ లైన్ వద్ద తడబడి బొక్కబోర్లా పడ్డాడు. జట్టు కష్టాల్లో ఉండగా బ్యాటింగ్కు వచ్చిన అతను 7 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో నిరాశగా పెవిలియన్ వైపు అడుగులు వేసిన అతను.. బౌండరీ రోప్ కాళ్లకు తగలడంతో బోర్లా పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
not ideal this#T20WorldCup pic.twitter.com/OcG6T6bKk4
— kεz (@_kezx) October 16, 2022