వేగంగా సమాచారం అందించేందుకు మీడియా సంస్థలు పోటాపోటీగా ట్రై చేస్తాయి. ఈ హడావుడిలో ఒక్కోసారి యాంకర్ల నాలుక మడతబడిపోవడం.. దాన్ని పట్టుకొని వీక్షకులు ఒక ఆట ఆడేసుకోవడం మామూలుగా మారిపోయింది. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా సారధి కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓపెనర్ డిబేట్‌పై స్పష్టతనిచ్చాడు.
కేఎల్ రాహుల్ తమ ప్రధాన ఓపెనర్ అని రోహిత్ స్పష్టం చేశాడు. అలాగే కోహ్లీని మూడో ఆప్షన్‌గా చూస్తామని చెప్పాడు. ఈ వార్తను ఒక హిందీ వార్తా సంస్థ టీవీలో చెప్పింది. ఈ సమయంలో యాంకర్ నాలుక మడతబడింది. కేఎల్ రాహుల్ పేరును పొరపాటున రాహుల్ గాంధీ అని చెప్పేశాడు.
‘టీ20 ప్రపంచకప్‌లో తనతోకలిసి రాహుల్ గాంధీనే ఓపెనింగ్ చేస్తాడని టీమిండియా సారధి రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. అవసరమైతే కోహ్లీ కూడా ఓపెనింగ్ చేస్తాడని చెప్పాడు’ అని ఆ యాంకర్ అనేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోయారు. ‘అది రాహుల్ గాంధీ కాదు, కేఎల్ రాహుల్’ అని కొందరు కామెంట్లు చేశారు. మరికొందరు ‘రాహుల్ గాంధీ ఓపెనింగ్ చేయడమేంటి?’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
T20 world cup me open karenge rahul gandhi😨 pic.twitter.com/LEABNLJxPs
— Mohit (@MohitRR19) September 18, 2022
BREAKING NEWS: Rahul Gandhi to quit Bharat Jodo yatra to play as an opener for Team India pic.twitter.com/Rl9uHE9Ct8
— Sanat Prabhu (@TheCovertIndian) September 20, 2022
@RahulGandhi @klrahul @DpHegde New opener Fot team India @BCCI pic.twitter.com/s4FRbghTL1
— somashekar padukare (@padukare) September 19, 2022