న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా కప్ టోర్నీకి ముందు భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త! గాయం నుంచి పూర్తిగా తేరుకున్న టీ20 కెప్టెన్ సూర్యకుమార్‌యాదవ్ ఫిట్నెస్ పరీక్షలో పాసయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్న సూర్యకుమార్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నట్లు తేలింది.
దీంతో ఈనెల 19న అజిత్ అగార్కర్ నేతృత్వంలో ఆసియా కప్ కోసం ప్రకటించనున్న టీమ్ఇండియా సూర్యకుమార్ కెప్టెన్సీలో బరిలోకి దిగడం ఖాయమైంది. ముంబైలో జరిగే సెలెక్షన్ కమిటీ సమావేశానికి సూర్య హాజరు కానున్నాడు. యూఈఏ వేదికగా వచ్చే నెల 9 నుంచి 28వ తేదీ వరకు ఆసియా కప్ జరుగనుంది.