భారత ఫాస్ట్‌బౌలర్ టీ నటరాజన్ గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మంగళవారం నటరాజన్ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడు పేసర్ మోకాలికి గాయం కావడంతో టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి సకాలంలో కోలుకోవడంలో నటరాజన్ విఫలమైన విషయం తెలిసిందే. మోకాలి సర్జరీ విజయవంతం కావడంతో నటరాజన్ ట్విటర్లో బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపారు.
‘ఇవాళ నేను మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాను. మెడికల్ టీమ్, సర్జన్లు, వైద్యులు, నర్సులు, స్టాఫ్ అందించిన సేవలు, పర్యవేక్షణకు ధన్యవాదాలు. బీసీసీఐ చేసిన సహకారానికి, తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు’ అంటూ నట్టూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో బెడ్‌పై ఉండగా విజయ సంకేతం చూపిస్తున్న ఫొటోను షేర్ చేశాడు. 2021లో నటరాజన్ హైదరాబాద్ తరఫున కేవలం రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
Today, I underwent knee surgery- and am grateful for the expertise, attention and kindness of the medical team, surgeons, doctors, nurses and staff. I’m grateful to @bcci and to all that have wished well for me. pic.twitter.com/Z6pmqzfaFj
— Natarajan (@Natarajan_91) April 27, 2021