IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) చివరి లీగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న కుర్రాడు వైభవ్ సూర్యవంశీ(57) అర్ధ శతకంతో విరుచుకుపడగా.. కెప్టెన్ సంజూ శాంసన్(41) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్ వీళ్లిద్దరిని ఒకే ఓవర్లో ఔట్ చేసి చెన్నైని పోటీలోకి తెచ్చాడు. కానీ.. ధ్రువ్ జురెల్(31 నాటౌట్), హిట్మైర్(12 నాటౌట్) ధనాధన్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
పద్దెనిమిదో ఎడిషన్‌ను రాజస్థాన్ రాయల్స్ విజయంతో ముగించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. 188 పరుగుల ఛేదనలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(36) దంచి కొట్టాడు. అతడిని అన్షుల్ బౌల్డ్ చేసి సీస్కేకే బ్రేకిచ్చాడు. ఆ తర్వాత ఆచితూచి ఆడిన కెప్టెన్ సంజూ శాంసన్(41), వైభవ్ సూర్యవంశీ(57)లు మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. అన్షుల్ వేసిన 6 వ ఓవర్ చివరి బంతిని వైభవ్.. చక్కని కవర్ డ్రైవ్‌తో బౌండరీకి తరలించాడు. దాంతో, రాజస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. పవర్ ప్లే జడేజా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదడంతో రాజస్థాన్ స్కోర్ 100 దాటింది.
No fear and pressure 🙅
Just pure finesse 😎Vaibhav Suryavanshi with a scintillating fifty in the chase 🔥
Updates ▶ https://t.co/hKuQlLxjIZ #TATAIPL | #CSKvRR | @rajasthanroyals pic.twitter.com/YUsYYeCQC0
— IndianPremierLeague (@IPL) May 20, 2025
నూర్ అహ్మద్ ఓవర్లో భారీ సిక్సర్‌తో రఘువంశీ అర్ధ శతకం సాధించాడు. అనుభవజ్ఞులైన చెన్నై బౌలర్లను ఉతికారేసిన ఈ చిచ్చరపిడుగు 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో ఫిఫ్టీకి చేరువయ్యాడు. వీళ్లిద్దరి మెరుపులతో గెలుపు దిశగా దూసుకెళ్లుతున్న రాజస్థాన్‌ను అశ్విన్ దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్లో శాంసన్, వైభవ్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. రియాన్ పరాగ్(3)ను నూర్ అహ్మద్ ఔట్ చేసి ర సంజూ సేనను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే.. అశ్విన్ బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్(31 నాటౌట్), హెట్‌మైర్(12 నాటౌట్)లు చెరొకి సిక్సర్ బాదడంతో రాజస్థాన్ విజయానికి చేరువైంది. పథిరన బౌలింగ్‌లో తొలి బంతినే జురెల్ స్టాండ్స్‌లోకి పంపగా రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Jurel says that’s how it’s done 😎@rajasthanroyals sign off from #TATAIPL 2025 in an emphatic way 🩷
Updates ▶ https://t.co/hKuQlLxjIZ #CSKvRR pic.twitter.com/F5H5AbcIVu
— IndianPremierLeague (@IPL) May 20, 2025
నామమాత్రపు పోరులో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కు వరుస షాక్‌లు తగిలాయి. రాజస్థాన్ రాయల్స్ పేసర్ యుధ్వీర్ సింగ్(3-47) చెలరేగగా డెవాన్ కాన్వే(10), ఉర్విల్ పటేల్(0) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. అయితే.. 12 పరుగులకే రెండు వికెట్లు పడినా ఓపెనర్ ఆయుశ్ మాత్రే(45) మెరుపు బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును ఉరికించాడు. అయితే.. రాజస్థాన్ బౌలర్ల ధాటికి జడేజా(1), అశ్విన్(13)లు పెవిలియన్ చేరారు. 78 పరుగులకే 5 వికెట్లు పడిన దశలో డెవాల్డ్ బ్రెవిస్(42), శివం దూబే(39) ఆరో వికెట్‌కు 59 రన్స్ జోడించి ఆదుకున్నారు.
ఈ ఇద్దరి మెరుపులతో సీఎస్కే 200 ప్లస్ కొట్టడం ఖాయనిపించింది. అయితే.. బ్రెవిస్ ఔటయ్యాక స్కోర్ వేగం తగ్గింది. డెత్ ఓవర్లలో బ్యాట్ ఝులిపించిన దూబే, కెప్టెన్ ఎంఎస్ ధోనీ(16)లు 7వ వికెట్‌కు 43 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్లో ఇద్దరిని ఔట్ చేసిన మధ్వాల్ చెన్నైని 187 పరుగులకే పరిమితం చేశాడు.