Suryakumar Yadav | దుబాయ్: టీమ్ఇండియా డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోమారు తళుక్కుమన్నాడు. తన వైవిధ్యమైన బ్యాటింగ్‌తో పొట్టి ఫార్మాట్‌కు కొత్త హంగులు అద్దిన సూర్యకుమార్..వరుసగా రెండో ఏడాది ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కైవసం చేసుకున్నాడు. టీ20ల్లో భారత మిడిలార్డర్‌కు సూర్య వెన్నెముక అని ఐసీసీ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించింది.
గతేడాది 150కి పైగా స్ట్రైక్‌రేట్‌తో సూర్య..పొట్టి ఫార్మాట్లో దుమ్మురేపాడు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లపై సూర్య అదరొట్టిన తీరుపై ప్రశంసలు కురిపించింది. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా సిరీస్ సందర్భంగా గాయపడ్డ ఈ డాషింగ్ బ్యాటర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. రానున్న ఐపీఎల్ ద్వారా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే అవకాశముంది.