Suryakumar Yadav | ముంబై: టీ20లలో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో చేరాడు. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ కారణంగా గతేడాది డిసెంబర్ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న మిస్టర్ 360.. శుక్రవారం ముంబై టీమ్‌తో కలిశాడు. అనంతరం అతడు వాంఖెడే స్టేడియంలో సహచర క్రికెటర్లతో కలిసి తనదైన ట్రేడ్ మార్క్ షాట్లు ఆడిన వీడియోను ఆ జట్టు ట్విటర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేసింది. ఇటీవలే ఎన్సీఏ నుంచి క్లీయరెన్స్ పొందిన సూర్య.. ఈ నెల 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.