Dhamaal 4 | అజయ్ దేవగన్ ‘ధమాల్ 4’ ట్రైలర్ రిలీజ్.. జూలై 10న థియేటర్లలో నవ్వుల హంగామా!
Dhamaal 4 | బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కామెడీ ఫ్రాంచైజీ 'ధమాల్' నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'ధమాల్ 4' అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. గత భాగాల లాగే ఈసారి కూడా కథ మొత్తం ఒక పెద్ద నిధి వేట చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
Dhamaal 4 | బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కామెడీ ఫ్రాంచైజీ ‘ధమాల్’ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమాల్ 4’ అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. గత భాగాల లాగే ఈసారి కూడా కథ మొత్తం ఒక పెద్ద నిధి వేట చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అడవులు, కొండలు, దెయ్యాలు, పులులు, మొసళ్ల మధ్య హీరోల గ్యాంగ్ చేసే రచ్చ, కామెడీ పంచులతో థియేటర్లలో నవ్వుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఈ సినిమాను జూన్ 12న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు సరికొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ, జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు హీరో అజయ్ దేవగన్ అధికారికంగా ధృవీకరించారు.
ఇంద్ర కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ అడ్వెంచరస్ కామెడీ ఎంటర్టైనర్లో అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సి, జావేద్ జాఫేరి, సంజయ్ మిశ్రాలతో పాటు కొత్తగా రవి కిషన్, ఈషా గుప్తా, సంజీదా షేక్, అంజలి ఆనంద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, అశోక్ థాకేరియా, ఆనంద్ పండిట్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman, Lover Kills Mother-In-Law | ప్రియుడితో కలిసి ఉన్న కోడలను పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

