Honor | 10000mAh భారీ బ్యాటరీతో హానర్ నుంచి త్వరలోనే కొత్త మొబైల్.. ఇంకా ఏం ఫీచర్లు ఉండబోతున్నాయంటే..!
Honor | స్మార్ట్ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు హానర్ కంపెనీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీ బ్యాటరీతో పలు మొబైళ్లను తీసుకొచ్చిన ఈ కంపెనీ.. తాజాగా 10,000mAh సామర్థ్యంతో కూడిన శక్తివంతమైన బ్యాటరీతో కొత్త ఫోన్ను తీసుకొస్తున్నట్లు తాజా లీకుల ద్వారా తెలుస్తోంది.
Honor | స్మార్ట్ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు హానర్ కంపెనీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీ బ్యాటరీతో పలు మొబైళ్లను తీసుకొచ్చిన ఈ కంపెనీ.. తాజాగా 10,000mAh సామర్థ్యంతో కూడిన శక్తివంతమైన బ్యాటరీతో కొత్త ఫోన్ను తీసుకొస్తున్నట్లు తాజా లీకుల ద్వారా తెలుస్తోంది.
చైనాకు చెందిన ప్రముఖ టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీబో వేదికగా హానర్ మొబైల్ గురించి సమాచారాన్ని పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హానర్ రూపొందిస్తున్న కొత్త హ్యాండ్సెట్లో 10,000mAh కెపాసిటీని మంచిన బ్యాటరీ ఉండనుంది. అలాగే ఫోన్ డిస్ప్లే కూడా గరిష్ఠంగా 10వేల నిట్స్ పీక బ్రైట్నెస్ అందించనుంది. ఈ సమాచారం నిజమైతే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల కంటే ఇది మరింత ప్రకాశవంతమైన డిస్ప్లే కలగనుంది.
అయితే ఈ ఫోన్ పేరు, ప్రాసెసర్, కెమెరా సిస్టమ్, చార్జింగ్ సామర్థ్యం, లాంచింగ్ డేట్ వంటి కీలక వివరాలేవీ ఇంకా బయటకు రాలేదు. ఈ లీకులపై హానర్ కంపెనీ కూడా అధికారికంగా స్పందించలేదు.
ఇటీవల భారీ బ్యాటరీతో కూడిన పలు స్మార్ట్ఫోన్లను హానర్ కంపెనీ చైనాలో విడుదల చేసింది. 2025 డిసెంబర్లో విడుదలైన Honor Win, Honor Win RT మోడళ్లలో 10,000mAh బ్యాటరీతో పాటు 6000 నిట్స్పీక్ బ్రైట్నెస్ డిస్ప్లే అందించింది. ఆ తర్వాత Honor Win Turbo వేరియంట్ను 10,000mAh బ్యాటరీ, 8000 నిట్స్పీక్ బ్రైట్నెస్తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అలాగే Honor Power 2 మోడల్లో 10,080mAh బ్యాటరీతో పాటు 8000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ డిస్ప్లే అందించింది. ఈ క్రమంలోనే త్వరలో తీసుకురాబోయే మొబైల్లో 10,000mAh బ్యాటరీతో పాటు 10,000 నిట్స్పీక్ బ్రైట్నెస్ అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే 10వేల నిట్స్పీక్ బ్రైట్నెస్ అనేది వాస్తవ వినియోగంలో ఆ స్థాయిలో అనుభవం ఇవ్వకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో, ఎండలో ఫోన్ వినియోగించినప్పుడు మాత్రం స్పష్టమైన డిస్ప్లే కనిపిస్తుందని అంటున్నారు.
ఇక లీకైన వివరాల ప్రకారం కొత్త హానర్ ఫోన్లో 6.79 అంగుళాల డిస్ప్లే, 1200*2640 పిక్సెల్ రిజల్యూషన్, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించే అవకాశం ఉంది. ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగించే అవకాశం ఉంది. అయితే ఈ వివరాలపై అధికారిక ప్రకటన తర్వాతనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

