Suryakumar Yadav : ఆసియా కప్‌లో ‘హ్యాండ్ షేక్’ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. పాకిస్థాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఆ దేశ బోర్డు టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ అనంతరం పహల్గాం బాధితులకు సూర్యకు సంఘీభావం తెలియజేయడాన్ని కూడా పీసీబీ తమ కంప్లైంట్లో ప్రస్తావించింది. దాంతో.. రిఫరీ రికీ రిచర్డ్సన్ ముందు గురువారం సూర్య విచారణకు హాజరయ్యాడు. లీగ్ దశలో టాస్ సమయంలో, ఆపై పాక్‌ను ఓడించిన తర్వాత ఆ జట్టు ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వలేదో భారత సారథి రిఫరీకి వివరించాడు. సూర్య వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న రిఫరీ శుక్రవారం తన తీర్పును వెలువరించనున్నాడు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ తొలిసారి ఆసియాకప్‌లో ఎదురుపడ్డాయి. సెప్టెంబర్ 21న లీగ్ దశలో దుబాయ్ వేదికగా దాయాది జట్లు తలపడ్డాయి. అయితే.. టాస్ సమయంలో పాక్ సారథి సల్మాన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సూర్య. అనంతరం చిరకాల ప్రత్యర్థిని 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన తర్వాత కూడా పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వచ్చేశారు సూర్య, శివం దూబేలు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ విజయాన్ని పహల్గాం బాధితులకు అంకితమిచ్చాడు భారత కెప్టెన్. దాంతో.. హ్యాండ్‌షేక్ వ్యవహారంపై పీసీబీ రాద్ధాంతం చేసింది.
🚨COMPLAINT AGAINST SURYAKUMAR YADAV🚨
“The PCB filed 2 complaints against Surya Kumar for his post-match presentation and press conference statements. Since Surya does not accept the allegation, a hearing will be held” 😮
– What’s your take 🤔#INDvPAK pic.twitter.com/ACWLu1CxyN
— Richard Kettleborough (@RichKettle07) September 25, 2025
రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చొరవ తీసుకోకపోవడం వల్లనే భారత కెప్టెన్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదని ఐసీసీకి ఫిర్యాదు చేసింది పాక్ బోర్డు. అంతేకాదు రిఫరీ ఆండీని తొలగించకుంటే టోర్నీని బాయ్‌కాట్ చేస్తామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. కానీ, అదేం కుదరదని ఐసీసీ తేల్చిచెప్పడంతో పాక్ తలొగ్గింది. సూపర్ – 4 మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు ఫర్హాన్, హ్యారిస్ రవుఫ్ల రెచ్చగొట్టే చేష్టలపై బీసీసీఐ కూడా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దాంతో.. సూర్యను టార్గెట్ చూస్తూ అతడిపై ఐసీసీకి కంప్లైంట్ ఇచ్చింది. భారత సారథి విచారణకు హాజరుకాగా.. పాక్ ఆటగాళ్లు ఫర్హాన్, రవుఫ్లను కూడా విచారణకు పిలవనుంది ఐసీసీ. ఒకవేళ పాక్ క్రికెటర్లు బీసీసీఐ వాదనను ఖండిస్తే తదుపరి చర్యలను ప్రకటించనుంది ఐసీసీ.