Spirit Of Cricket :క్రికెట్లో క్రీడాస్ఫూర్తి అనే పదం తరచూ తెరపైకి వస్తుంటుంది. మైదానంలో హుందాగా ప్రవర్తించడం, ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వడం ద్వారా కొందరు ఆటగాళ్లు ఆదర్శంగా నిలుస్తారు. తాజాగా భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suraykumar Yadav) క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. ఆసియా కప్(Asia Cup 2025)లో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో మిస్టర్ 360 అప్పీల్‌ను వెనక్కి తీసుకొని అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. అసలేం జరిగిందంటే..?
పదిహేడో సీజన్ ఆసియా కప్‌లో దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, యూఏఈ తలపడ్డాయి. టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రత్యర్ధిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. యూఏఈ ఇన్నింగ్స్ 13 ఓవర్లో శివం దూబే బంతి అందుకున్నాడు. క్రీజులో ఉన్న జనైద్ సిద్దిఖీ మూడో బంతిని ఆడబోయి మిస్ అయ్యాడు. అయితే.. అతడు క్రీజు అవతల ఉండడం గమనించిన వికెట్ కీపర్ సంజూ శాంసన్ (Sanju Samson) రెప్పపాటులో బంతిని వికెట్లకు గురి చూసి కొట్టాడు. దాంతో, భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు. ఔటా? నాటౌటా? అనేది తేల్చడం కోసం థర్డ్ అంపైర్ రివ్యూ పరిశీలించాడు. బిగ్ స్క్రీన్ మీద జునైద్ ఔట్ అని ప్రకటించాడు అంపైర్.
Captain Suryakumar Yadav recalled the batter even after he was declared out. pic.twitter.com/tIdZG2LIfT
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 10, 2025
కానీ, యూఏఈ బ్యాటర్ మాత్రం తాను పరుగెత్తే సమయంలో దూబే టవల్ కింద పడిన విషయాన్ని అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయంపై ఫీల్డ్ అంపైర్‌తో మాట్లాడిన సూర్య.. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. అయినా సరే.. కాసేపటికే సిద్ధిఖీని దూబే డకౌట్‌గా పెవిలియన్ పంపాడు. కుల్దీప్ యాదవ్ నాలగు వికెట్లు.. దూబే మూడు వికెట్లు తీయడంతో యూఏఈ జట్టు 57 పరుగులకే కుప్పకూలింది.
A dominating show with the bat! 💪
A 9⃣-wicket win for #TeamIndia after chasing down the target in 4.3 overs. 👏👏
Scorecard ▶️ https://t.co/Bmq1j2LGnG#AsiaCup2025 | #INDvUAE pic.twitter.com/ruZJ4mvOIV
— BCCI (@BCCI) September 10, 2025
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 4.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(30), శుభ్‌మన్ గిల్(19 నాటౌట్)లు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. దాంతో, మరో 93 బంతులు ఉండగానే టీమిండియా విజయం సాధించి టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది.