Suryakumar Yadav : ఐసీసీ ఈవెంట్లలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. దాయాదుల మధ్య నువ్వానేనా అన్నట్టు సాగే పోరాటాన్ని కళ్లారా చూసేందుకు అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతారు. కానీ, పదో సీజన్ టీ20 ప్రపంచకప్‌లో ఇండో-పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. లీగ్ దశలో టీమిండియాతో ఆడబోమని పాక్ ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ఫిబ్రవరి 15న దాయాదుల మ్యాచ్ లేనట్టేనా? అని ఫ్యాన్స్ నిట్టూర్చుతున్నారు. అయితే.. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) మాత్రం మేము ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాడు.
మరో రెండు రోజుల్లో భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ షురూ కానుంది. వామప్ మ్యాచ్‌లతో ఇప్పటికే స్టేడియాల్లో సందడి నెలకొనగా.. మెగా టోర్నీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉంటుందా? ఉండదా? అనేది తేలడం లేదు. లీగ్ దశలో పాక్ జట్టు ఫిబ్రవరి 15న ఇండియాతో తలపడదని ఆ దేశ ప్రభుత్వం, కెప్టెన్ సల్మాన్ అఘా వెల్లడించారు. అయితే.. తాము మాత్రం ఐసీసీ నిబంధనలను పాటిస్తామని, ఆరోజు స్టేడియానికి భారత జట్టు వెళ్తుందని బీసీసీఐ పేర్కొంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఇదే విషయాన్ని పునరుద్ఘాటించాడు.
Suryakumar Yadav started owning Pakistani.🔥
Speaking about Pak boycott match vs India 🎙️ “Our mindset is very clear. We haven’t said no to playing them (Pak), they are the ones who’ve said no. Our flights are booked and we are going to Colombo. Our fixtures are ready first USA,… pic.twitter.com/6tJ6PUENXk
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) February 5, 2026
గురువారం మీడియాతో మాట్లాడిన సూర్య.. ‘మేము చాలా స్పష్టంగా ఉన్నాం. పాకిస్థాన్‌తో ఆడబోమని మేము అనలేదు. వాళ్లే బాయ్‌కాట్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే మేము విమానాలు బుక్ చేసుకున్నాం. కొలంబోకు కచ్చితంగా వెళ్తాం. లీగ్ దశ తొలి మ్యాచ్‌లో యూఎస్ఏ, కెనడాతో తలపడుతాం.. అనంతరం కొలంబోకు వెళ్తాం’ అని వెల్లడించాడు. ఏడాదికిపైగా ఫామ్‌లేమితో బాధపడిన సూర్య.. న్యూజిలాండ్ సిరీస్‌తో టచ్‌లోకి వచ్చాడు. వరుసగా మూడు అర్ధ శతకాలతో నేను రెఢీ అని ప్రత్యర్ధులకు గట్టి హెచ్చరికలు పంపాడీ చిచ్చరపడిగు.
షెడ్యూల్ ప్రకారం లీగ్ దశలో భారత జట్టు ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో తలపడాలి. కానీ, ఇండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించడంతో దాయాదుల బిగ్ ఫైట్ చూడాలనుకున్న కోట్లాదిమంది షాక్ అవుతున్నారు. అయితే.. బీసీసీఐ మాత్రం పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని తేలికగానే తీసుకుంది. తాము ఐసీసీ ప్రొటోకాల్ పాటిస్తామని, షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న భారత జట్టు కొలంబో స్టేడియానికి వెళ్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. పాక్ జట్టు మైదానానికి రాకుంటే రిఫరీ మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించేంత వరకూ భారత క్రికెటర్లు అక్కడే ఉంటారని బోర్డు చెప్పింది.