న్యూఢిల్లీ: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)..ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. అతను అక్కడ శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. గజ్జల్లో గాయానికి అతను ట్రీట్మెంట్ తీసుకోనున్నాడు. ఒకవేళ అవసరం అయితే స్పోర్ట్న్ హెర్నియాకు శస్త్ర చికిత్స తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో.. సూర్యకుమార్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఆ టోర్నీలో అతను ముంబై ఇండియన్స్ తరపున 700 పైగా రన్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత ఈ మధ్యే ముంబై ప్రీమియర్ లీగ్ టీ20 కూడా ఆడాడతను.
అయితే ముంబై టీ20 టోర్నీ ఆడుతున్న సమయంలో.. అతని గజ్జల్లో నొప్పి మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. వరుసగా బ్రేక్ లేకుండా క్రికెట్ ఆడడం వల్ల కూడా సమస్య అధికంగా అయినట్లు అనుమానిస్తున్నారు. స్పోర్ట్స్ హెర్నియా చికిత్స కోసం యూకేకు సూర్య వెళ్లినట్లు ఓ బీసీసీఐ అధికారి ద్వారా తెలిసింది. అయితే మళ్లీ ఆగస్టు నెల వరకు టీ20 మ్యాచ్‌లు లేకపోవడంతో.. ఈ సమయంలో ట్రీట్మెంట్ తీసుకోవాలని సూర్య భావించాడు. చికిత్స ముగిసిన తర్వాత బెంగుళూరులోని ఎక్సలెన్సీ సెంటర్లో కోలుకునే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.