Surya Kumar | టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మపై టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టీ20ల్లో వరుస సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించాడు తిలక్ వర్మ. రెండు టీ20ల్లోనూ వరుసగా విజయం సాధించిన భారత జట్టు 3-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. గతంలో విరాట్ కోహ్లీని నంబర్ త్రీలో మాస్టర్‌గా నిలువగా.. ఇటీవల ఆ స్థానం కోసం పలువురు బ్యాట్స్‌మెన్ ప్రయత్నించారు. టీ20 ప్రపంచకప్ సమయంలో రిషబ్ పంత్‌తో టీమ్ థింక్ ట్యాంక్ సైతం ప్రయోగాలు చేసింది. రిషబ్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కి ముందు రితురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ తదితర ఆటగాళ్లు సైతం మూడోస్థానంలో బ్యాటింగ్ చేశారు. తాజాగా తిలక్ వర్మ ఆ ప్లేస్‌లో రాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ యువ ఆటగాడు భవిష్యత్ స్టార్‌గా పలువురు పేర్కొంటున్నారు. ఈదక్షిణాఫ్రికాపై విజయం అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో తిలక్ గొప్ప ఆటగాడని మెచ్చుకున్నాడు.
సిరీస్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఈ వీడియోలో సూర్యకుమార్ మాట్లాడుతూ నెంబర్ త్రీలో యువ ఆటగాడికి అవకాశం ఇవ్వడం సరైందేనని తెలిపారు. తిలక్‌తో మాట్లాడానని.. అతను ఆ బాధ్యతలు తీసుకున్నాడన్నారు. మైదానంలో బ్యాట్‌తో మాట్లాడిన తీరు చూపేందుకు ఎంతో అపురూపంగా ఉందని.. కేవలం టీ20ల్లోనే కాకుండా అన్ని ఫార్మాట్లలో అదే స్థాయిలో బ్యాట్‌తో రాణిస్తాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సెంచరీలు సాధించిన తిలక్, శాంసన్‌లను సూర్య అభినందించాడు. భారత క్రికెట్ పునాది ఎంత బలంగా ఉందని చెప్పాడు. శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్ పునరాగమనం తర్వాత శాంసన్ స్థానంపై ప్రశ్నించగా.. ఇది జట్టుకు మంచి తలనొప్పి అని పేర్కొన్నాడు. జట్టులో 20-25 మంది ఆటగాళ్లు ఉండటం, 11 మందిని ఎంపిక చేయడం సవాల్‌గా మారిందని.. ఇది ఏ జట్టుకైనా చాలా మంచి పరిస్థితేనని చెప్పాడు. టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లు, బీసీసీఐ ఈ తలనొప్పిని ఎదుర్కోవాల్సి ఉంటుందని.. ఇందులో ఎలాంటి సమస్యలేదని చెప్పాడు.