IND vs BAN : భారత్ నిర్దేశించిన భారీ ఛేదనలో బంగ్లాదేశ్ పోరాడుతోంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్. వరుణ్ చక్రవర్తిలు వరసగా వికెట్లు పడుతుండడంతో సగం వికెట్లు కోల్పోయింది. 13వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు త్రో కారణంగా జకీర్ అలీ() రనౌట్ అయ్యాడు. దాంతో.. 87కే ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఓపెనర్ సైఫ్ హసన్(49), మొహమ్మద్ సైఫుద్దీన్ క్రీజులో ఉన్నారు. ఇంకా బంగ్లా విజయానికి 82 రన్స్ కావాలి.
లక్ష్యం పెద్దది కావడంతో బంగ్లా ఓపెనర్లు దూకుడుగా ఆడాలనుకున్నారు. కానీ, బుమ్రా తన మొదటి ఓవర్లోనే ఓపెనర్ తంజిమ్ హసన్(1)ను ఔట్ చేసిన బంగ్లాను ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఆతర్వాత కుల్దీప్ యాదవ్ ఓవర్లో పర్వేజ్ హొసేన్(21) స్వీప్ షాట్ ఆడి అభిషేక్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే అక్షర్ పటేల్ మ్యాజిక్ బాల్‌తో తౌహిద్ హ్రిదొయ్(7)ను ఔట్ చేయగా.. షమీమ్ హొసేన్(0)ను వరుణ్ చక్రవర్తి డకౌట్‌గా పెవిలియన్ పంపాడు. దాంతో.. 74కే బంగ్లా నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
A superb direct hit from Captain @surya_14kumar ends Jaker Ali’s stay out there in the middle 👏
Live – https://t.co/2CvdQIp2qu #INDvBAN #AsiaCup2025 #Super4 pic.twitter.com/TofRYbONmq
— BCCI (@BCCI) September 24, 2025
ఆ కాసేపటికే కెప్టెన్ జకీర్ అలీ(4)ని సూర్యకుమార్ మెరుపు వేగంతో రనౌట్ చేసి బంగ్లా కష్టాలను మరింత పెంచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న ఓపెనర్ సైఫ్ హసన్(65 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అక్షర్ ఓవర్లో సిక్సర్‌తో అర్ధ శతకం సాధించిన అతడు టెయిలెండర్ల అండతో జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.