Surya Kumar Yadav | ఐసీసీ మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా సూర్య కుమార్ యాదవ్
టీ20 ఫార్మాట్లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును పొందిన తొలి భారతీయ క్రికెటర్‌గా ఎస్కేవై చరిత్ర సృష్టించారు.
Surya Kumar Yadav | టీమిండియా మిస్టర్ 360 గా పేరుగాంచిన సూర్యకుమార్ యాదవ్ కిరీటంలో మరో కలికి తురాయి చేరింది. ఐసీసీ మెన్స్ టీ20 లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ చరిత్ర సృష్టించారు. ఈ అవార్డు తనను వరించడంతో గొప్ప అనుభూతి పొందుతున్నానని సూర్య కుమార్ యాదవ్ చెప్పారు.
భారత విధ్వంసకర బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ 2022 సంవత్సారానికి గాను ఐసీసీ పురుషుల టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్థానం సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డెలకెక్కాడు. ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ సామ్ కుర్రాన్, పాకిస్తానీ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా కూడా ఈ ఐసీసీ టైటిల్ కోసం పోటీ పడిన వారిలో ఉన్నారు. 2022 తనకు ఎంతో అద్భుతమైనదని, టీ20 మ్యాచులను ఎంతో ఆస్వాదిస్తూ ఆడినట్లు సూర్య కుమార్ చెప్పారు.
అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఏడాది తర్వాత సూర్యకుమార్ తన ఆట తీరుతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. రికార్డుల శ్రేణులను బద్దలు కొడుతున్న ఈ బ్యాట్స్‌మెన్ టీ 20 ఫార్మాట్లో మునుపెన్నడూ లేని విధంగా బెంచ్‌మార్క్‌ను నెలకొల్పాడు. అతను టీ20 లలో ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ బ్యాటర్‌గా నిలిచాడు. 31 మ్యాచ్‌లలో 187.43 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా 2022 సంవత్సరాన్ని ముగించాడు. వీటిలో 68 సిక్సర్లతో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

