ICC : పొట్టి క్రికెట్ సంచలనం సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మరోసారి అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్(Batting Rankings)లో మిస్టర్ 360 సూర్య నంబర్ 1గా ఉన్నాడు. టీ20ల్లో మెరుపు బ్యాటింగ్‌కు కేరాఫ్ అయిన భారత కుర్రాడు యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో ఉతికేసిన యశస్వీ 700 పాయింట్లతో ఆరో స్థానం సంపాదించాడు.
ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ రెండో స్థానంలో, పాకిస్థాన్ సారథి బాబర్ ఆజాంలు మూడో స్థానంలో నిలిచారు. దక్షిణాఫ్రికా నుంచి మర్క్రమ్, క్లాసెన్, వెస్టిండీస్ నుంచి బ్రాండన్ కింగ్.. ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్లు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మెరిశారు.
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్(Adil Rashid) నంబర్ 1 స్థానం కైవసం చేసుకున్నాడు. శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగ రెండో స్థానంలో ఉండగా.. భారత స్పిన్నర్లు ఇద్దరూ టాప్-10లో నిలిచారు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel) 7వ స్థానంతో, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లు 10వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో అఫ్గనిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ నంబర్ 1 ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. భారత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 8వ ప్లేస్ సొంతం చేసుకున్నాడు.
A strong start to the #T20WorldCup has seen a new No.1 ranked all-rounder crowned on the latest ICC Men’s Player Rankings 👀
Details ⬇https://t.co/sUroyHnKQU
— ICC (@ICC) June 12, 2024