IND vs PAK : వరల్డ్ కప్‌లోనే కాదు ఆసియా కప్‌లోనూ తమకు తిరుగులేదని చాటుతూ పాకిస్థాన్‌ను చిత్తు చేసింది భారత జట్టు. ఆదివారం చిరకాల ప్రత్యర్థిని మట్టికరిపించిన టీమిండియా ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. దుబాయ్ స్టేడియంలో కుల్దీప్ యాదవ్ విజృంభణలో 127కే పాక్ పరిమితం అవ్వగా.. ఛేదనలో అభిషేక్ శర్మ (31) బౌండరీల మోతతో మెరుపు ఆరంభం ఇచ్చాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(47 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మూడో వికెట్‌కు తిలక్ వర్మ(31)తో కలిసి 56 రన్స్ జోడించిన సూర్య జట్టు విజయానికి బాటలు వేశాడు. ఫినిషర్ శివం దూబే(10 నాటౌట్) తనదైన స్టయిల్లో ఆడగా.. సిక్సర్‌తో భారత్‌కు 7 వికెట్ల విజయాన్ని అందించాడు సూర్య.
ఆసియా కప్‌లో బాయ్‌కాట్ నిరసనల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయఢంకా మోగించింది. చిరకాల ప్రత్యర్థి పాక్‌ను వణికిస్తూ భారీ విక్టరీతో ఈజీ కాదని మరోసారి చాటింది. తొలుత పాక్‌ను 127కే నిలువరించిన నిర్దేశించిన టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే అందుకుంది. దాయాది నిర్దేశించిన ఛేదనను భారత్ ధాటిగా మొదలెట్టింది. షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లో మొదటి రెండు బంతులకు అభిషేక్ శర్మ 4, 6 బాదాడు. రెండో ఓవర్లో సయీం అయూబ్‌ను ఉతికేస్తే శుభ్‌మన్ గిల్(10) రెండు ఫోర్లు కొట్టాడు.
2⃣ wins on the bounce for #TeamIndia! 🙌
A dominating show with bat & ball from Surya Kumar Yadav & Co. to bag 2 more points! 👏 💪
Scorecard ▶️ https://t.co/W2OEWMTVaY#AsiaCup2025 pic.twitter.com/hM7iin7AAq
— BCCI (@BCCI) September 14, 2025
అయితే.. ఆఖరి బంతికి షాట్ ఆడబోయిన గిల్ స్టంపౌట్ అయ్యాడు. వికెట్ పడినా సరే అభిషేక్ జోరు తగ్గించలేదు. సయీంను లక్ష్యంగా చేసుకొని రెండు బౌండరీలు సాధించిన అతడు అతడి ఓవర్లోనే వెనుదిరిగాడు. అభిషేక్ ఔటయ్యాక వచ్చిన తిలక్ వర్మ(31) సైతం ఫోర్లతో చెలరేగాడు. నవాజ్ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లతో జట్టు స్కోర్ 60 దాటించాడు. దాంతో.. పవర్ ప్లేలో భారత్ రెండు వికెట్ల నష్టానికి 61 స్కోర్ చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(47 నాటౌట్), తిలక్ . మూడో వికెట్‌కు విలువైన 56 రన్స్ జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
Innings Break!
Brilliant bowling display by our bowlers as Pakistan is restricted to 127/9 in 20 overs.
Kuldeep Yadav with 3 wickets, Axar Patel and Jasprit Bumrah with 2 apiece.
Scorecard – https://t.co/D7cDABHqaf #AsiaCup2025 pic.twitter.com/xQNHvIqiBs
— BCCI (@BCCI) September 14, 2025
అయితే.. అయుబ్ ఓవర్లో తిలక్ బౌల్డ్ కాగా.. అప్పటికి విజయానికి 45 బంతుల్లో 31 రన్స్ కావాలి. అనంతరం శివం దూబే(10 నాటౌట్) అండగా సూర్య చెలరేగిపోయాడు. సయీం వేసిన 15వ ఓవర్లో చివరి బంతిని దూబే స్టాండ్స్‌లోకి పంపాడు. సూఫియన్ బౌలింగ్‌లో ఎల్బీ అప్పీల్ అనంతరం సారథి సూర్య సిక్సర్ బాదగా 7 వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది భారత్. ఈ విక్టరీతో సూర్యకుమార్ యాదవ్ బృందం సూపర్ 4కు చేరువైంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాకిస్థాన్ భారత బౌలర్ల విజృంభణతో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వికెట్ల వేటతో పాక్‌ను మానసికంగా దెబ్బతీశారు. యూఏఈపై చెలరేగిన కుల్దీప్ యాదవ్(3-18) మరోసారి తన స్పిన్ మ్యాజిక్‌తో మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టగా.. అక్షర్ పటేల్(2-18) ఓ చేయి వేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్(41) ఒంటరి పోరాటం చేశాడు. ఆఖర్లో షాహిన్ ఆఫ్రిది(33 నాటౌట్) నాలుగు సిక్సర్లతో రెచ్చిపోయాడు. దాంతో పాక్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 రన్స్ చేసింది.