ISSF World Cup : ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో భారత మహిళా షూటర్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎలవేనిల్ వలరివన్ (Elavenil Valarivan),. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో సిఫ్ట్ కౌర్ సమ్రా (Sift Kaur Samra) కంచు మోత మోగించగా.. శుక్రవారం సురుచి సింగ్(Suruchi Singh) పసిడి పతకంతో దేశం గర్వపడేలా చేసింది. మ్యునిచ్ నగరంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో గురి చూసి కాల్చిన తను గోల్డ్ మెడల్ కొల్లగొట్టింది. ఈ పోటీల్లో ఆమె వరుసగా మూడో పతకం గెలుపొందడం విశేషం.
ఏప్రిల్ నెలలో బునోస్ ఏరిస్‌లో పసిడితో మెరిసిన సురుచి ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లోనూ గర్జించింది. వ్యక్తిగత విభాగంలో 19 ఏళ్ల అమ్మాయి హ్యాట్రిక్ మెడల్ సాధించింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో సుచీకి ఫ్రాన్స్‌కు చెందిన కమిల్లె జెద్రజెవ్స్కీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. చివరి షాట్లో భారత షూటర్ 10.5తో 24.19 పాయింట్లు సాధించి అగ్రస్థానం సొంతం చేసుకుంది. దాంతో 9.8 మార్క్‌కు పరిమితమైన కమిల్లె 241.7తో వెండి పతకం అందుకుంది. క్జియాన్గ్జన్ యావో(చైనా) కాంస్యంతో మురిసింది.
REMEMBER THE NAME SURUCHI SINGH 🇮🇳
– 3rd Consecutive Gold Medal at ISSF WC! 🥇 pic.twitter.com/RHZPzOlH7O
— The Khel India (@TheKhelIndia) June 13, 2025
షూటింగ్ వరల్డ్ కప్‌లో పారిస్ ఒలింపిక్ విజేత మనూ బాకర్(Manu Bhaker) తీవ్రంగా నిరాశపరిచింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఆమె 574 పాయింట్లతో 25వ స్థానంలో నిలిచింది. ఈమధ్యే ఆసియా క్రీడల్లో 453.1 పాయింట్లతో వరల్డ్ రికార్డు నెలకొల్పిన సిఫ్ట్ కౌర్ సమ్రా (Sift Kaur Samra)8 మంది పోటీపడిన ఫైనల్లో సత్తా చాటింది. పసిడి పతకం వేటలో వెనకబడినా.. కంచు మోతతో దేశం గర్వపడేలా చేసింది. పంజాబ్‌లోని ఫరీద్‌కోటకు చెందిన సిఫ్ట్.
క్వాలిఫికేషన్ రౌండ్లో రెండో స్థానంలో నిలిచిన సిఫ్ట్ నీలింగ్, ప్రోన్, స్టాండిగ్.. ఈ మూడు పోటీల్లో 592 పాయింట్లు తెచ్చుకుని ఫైనల్‌కు అర్హత సాధించింది. కానీ, స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో కాంస్యంతో సరిపెట్టుకుందీ యువ షూటర్.
సిఫ్ట్ కౌర్
జూన్ 10 మంగళవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పిస్టల్ ఫైనల్లో వలరివన్ కాంస్యంతో మెరిసింది. పసిడిపై గురి పెట్టిన తను చివరకు కంచుమోత మోగించింది. జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా క్వాలిఫికేషన్ రౌండ్లో అదరగొట్టిన 25 ఏళ్ల ఈ యువకెరటం స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది. అయితే.. 231.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.