ఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో తొలిరోజే సత్తాచాటిన భారత షూటర్ల పతక వేట రెండో రోజూ కొనసాగింది. పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో యువ షూటర్లు సురుచి సింగ్-సామ్రాట్ రాణా ద్వయం రజతం గెలుచుకుంది.
ఫైనల్లో భారత జోడీ.. 479.6 పాయింట్లతో రెండో స్థానాన నిలిచి పతకం సాధించింది.