Suresh Raina | వరల్డ్ కప్‌లో అతను సెహ్వాగ్, యూవీలా బంతితో రాణిస్తాడు : సురేశ్ రైనా
వరల్డ్ కప్ టీమ్‌లో యంగ్ ఆల్‌రౌండర్ దీపక్ హూడా(Deepak Hooda)కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతను బ్యాటుతో చెలరేగడమే కాకుండా బంతితో మ్యాజిక్ చేయగలడని రైనా చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ భారత్‌లో ప్రారంభం కానుంది.
Suresh Raina :ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ భారత్‌లో జరగనుంది. స్వదేశంలో జరగనున్న ఈ టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలవాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ 20 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. వాళ్ల పేర్లు మాత్రం వెల్లడించలేదు. ఆ 20 మందిలో ఫలానా వాళ్లు ఉండాలని కొందరు మాజీ క్రికెటర్లు అభిలషించారు. తాజాగా, వరల్డ్ కప్ టీమ్‌లో యంగ్ ఆల్‌రౌండర్ దీపక్ హూడా(Deepak Hooda)కు అవకాశం ఇవ్వాలని, అతను బ్యాటుతో చెలరేగడమే కాకుండా బంతితో మ్యాజిక్ చేయగలడని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయం వ్యక్తం చేశాడు.
‘నాకు ఇప్పటికి గుర్తుంది. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేసేవాళ్లు. యూసుఫ్ పఠాన్, నేను కూడా బంతితో రాణించేవాళ్లం. దీపక్ హుడా కూడా వరల్డ్ కప్‌లో అచ్చం అలాంటి పాత్రనే పోషిస్తాడు. అని రైనా తెలిపాడు. అఅంతేకాదు అతను అతను చురుకైన ఫీల్డర్, వన్డేల్లో టీ20 ఫామ్‌ను కొనసాగిస్తాడు’ అని ఈ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. పోయిన ఏడాది నవంబర్‌లో న్యూజిలాండ్ సిరీస్‌లో హుడా చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ సిరీస్‌లో అతను రాణించకపోవడంతో స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లకు ఎంపిక కాలేదు. ఇప్పటి వరకు హుడా 10 వన్డేలు ఆడాడు. 153 రన్స్ కొట్టాడు.
ధోనీ కెప్టెన్సీలో..
ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఎం.ఎస్. ధోనీ కెప్టెన్సీలో 2011లో చాంపియన్‌గా అవతరించిన టీమిండియా మూడోసారి విశ్వ విజేతగా నిలవాలని భావిస్తోంది. 2011 తర్వాత ఇప్పటివరకూ భారత జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. దాంతో, ఈసారి ఎలాగైనా వన్డే వరల్డ్ కప్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది.
ఇవి కూడా చదవండి
Rohit Sharma | గులాబీ పువ్వు ఇచ్చిన అభిమాని.. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగిన రోహిత్
Heather Knight | భారత్‌లో క్రికెటర్లను దేవుళ్లుగా కొలుస్తారు.. ఎందుకంటే..? : ఆర్సీబీ ఆల్‌రౌండర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

