Rohit Sharma | గులాబీ పువ్వు ఇచ్చిన అభిమాని.. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగిన రోహిత్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రెస్ మీట్లో సరదాగా మాట్లాడతాడని, , డ్రెస్సింగ్ రూమ్‌లో జోక్స్ పేలుస్తాడని తెలిసిందే. రెండో వన్డే కోసం విశాఖపట్నం వచ్చిన సందర్భంగా హిట్‌మ్యాన్‌కు ఒకతను గులాబీ పువ్వు ఇచ్చాడు. ఆ వెంటనే టీమిండియా కెప్టెన్ అతడిని నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రెస్ మీట్లో సరదాగా మాట్లాడతాడని, , డ్రెస్సింగ్ రూమ్‌లో జోక్స్ పేలుస్తాడని తెలిసిందే. రెండో వన్డే కోసం విశాఖపట్నం వచ్చిన సందర్భంగా రోహిత్ ఒక అభిమానితో జోక్ చేశాడు. హిట్‌మ్యాన్‌కు ఒకతను గులాబీ పువ్వు ఇచ్చాడు. ఆ వెంటనే టీమిండియా కెప్టెన్ అతడిని నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ఊహించని పరిణామంతో ఆ అభిమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ప్ర్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైజాగ్ చేరుకున్న టీమిండియా ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తుండగా ఒకతను సెల్ఫీ వీడియో తీస్తున్నాడు. అతను రోహిత్ దగ్గరకు రాగానే తన చేతిలోని గులాబీ పువ్వు ఇచ్చాడు. దాంతో.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని రోహిత్ అతడితో జోక్ చేశాడు. అందుకు ఆ అభిమాని.. ‘కెప్టెన్ చాలా సరదా మూడ్‌లో ఉన్నాడు’ అని కామెంట్ చేశాడు.
చెన్నైలో మూడో వన్డే
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border – Gavaskar Trophy) తర్వాత రోహిత్ బ్రేక్ తీసుకున్నాడు. తొలి వన్డేకు అతను దూరం కావడంతో హార్దిక్ పాండ్యా సారథ్యం వహించాడు. రెండో వన్డే కోసం రోహిత్ జట్టుతో కలిశాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్, మిచెల్ స్టార్క్ దెబ్బకు 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (51), మిచెల్ మార్ష్ (66) హాఫ్ సెంచరీలు కొట్టడంతో 11వ ఓవర్లోనే ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది. వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరగనుంది.
Rohit Sharma is an amazing character – what a guy! pic.twitter.com/YZzPmAKGpk
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2023
ఇవి కూడా చదవండి
IND vs AUS | అర్ధ శతకాలు బాదిన మార్ష్, హెడ్ .. రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
Delhi Capitals | ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీ విడుదల.. స్పెషల్ ఏంటంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

