IND vs AUS | అర్ధ శతకాలు బాదిన మార్ష్, హెడ్ .. రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
IND vs AUS : విశాఖపట్నలో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా (Australia) ఘన విజయం సాధించింద. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియాను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్(66) ట్రావిస్ హెడ్ (51) అర్ధ శతకాలతో చెలరేగారు. వీళ్లిద్దరూ టీ20 తరహాలో బ్యాటింగ్ చేయడంతో ఆసీస్ మరో234 బంతులు ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది.
IND vs AUS : విశాఖపట్నలో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా (Australia) ఘన విజయం సాధించింద. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియాను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్(66) ట్రావిస్ హెడ్ (51) అర్ధ శతకాలతో చెలరేగారు. వీళ్లిద్దరూ టీ20 తరహాలో బ్యాటింగ్ చేయడంతో ఆసీస్ మరో234 బంతులు ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. ఈ విజయంతో 1-1తో వన్డే సిరీస్‌ను సమం చేసింది. సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరిగనుంది.
తొలి వన్డేలో గెలిచి ఊపు మీదున్న భారత్‌కు షాక్. రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్ వశం చేసుకోవాలనుకున్న టీమిండియా ఆశలపై ఆసీస్ నీళ్లు చల్లింది. పేసర్లు స్టార్క్, అబాట్ చెలరేగడంతో భారత్‌ను 117 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా.. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది.
29 బంతుల్లో ఫిఫ్టీ
మొదటి వన్డేలో మెరపు ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ మిచెల్ మార్ష్ రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగించాడు. ఎడాపెడా బౌండరీలు కొడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఎనిమిదో ఓవర్లో మూడు సిక్స్‌లు బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడిన మార్ష్ 29 బంతుల్లో 5 బౌండరీలు, 5 సిక్స్‌లతో యాభైకి చేరువయ్యాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా అర్ధ శతకం కొట్టడంతో ఆస్ట్రేలియా 11 ఓవర్లకే మ్యాచ్ ముగిచింది.
కోహ్లీ, అక్షర్ మాత్రమే
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 117 పరుగులకు ఆలౌట్ అయింది. స్వదేశంలో మూడో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. పిచ్ పేస్‌కు అనుకూలించడంతో ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చెలరేగిపోయాడు. అతని ధాటికి టాపార్డర్ కుప్పకూలింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్(0)ను ఔట్ చేసిన అతను ఆ తర్వాత ఒకే ఓవర్లో రోహిత్ శర్మ(13), సూర్యకుమార్ యాదవ్(0)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. కేఎల్ రాహుల్(9)ను కూడా ఔట్ చేసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. కుదురుకున్న విరాట్ కోహ్లీ (31) ని ఎల్లిస్ ఎల్బీగా ఔట్ చేశాడు. అప్పటికి భారత్ స్కోర్.. 71/6.
ఒక దశలో 100 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ, రవీంద్ర జడేజా (16), అక్షర్ పటేల్ (29) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఏడో వికెట్‌కు 20 రన్స్ జోడించారు. సియాన్ అబాట్ ఒకే ఓవర్లో కుల్దీప్ యాదవ్ (4), మహమ్మద్ షమీ(0)ని ఔట్ చేశాడు. 26వ ఓవర్ వేసిన స్టార్క్ ఆఖరి బంతికి సిరాజ్‌ను బౌల్డ్ చేయడంతో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ బౌలర్లలో సియాన్ అబాట్ మూడు, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

