Suraykumar Yadav : ఆసియా కప్ విజేతగా ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు అక్కడా విజయఢంకా మోగించింది. ఐదు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది టీమిండియా. తన సారథ్యంలో జట్టును అజేయ శక్తిగా మారుస్తున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suraykumar Yadav) ట్రోఫీ అందుకున్న తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ ట్రోఫీ ఇంకా చేతికందని విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన సూర్య.. మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) తీరును మరోసారి తప్పుపట్టాడు. ఇంతకూ సూర్య ఏం అన్నాడంటే..?
గబ్బాలో జరగాల్సిన చివరి టీ20 వర్షార్పణం కావడంతో రెండు విజయాలతో ముందున్న భారత్‌కు సిరీస్ విజేతగా నిలిచింది. ఇప్పటికూ రెండుసార్లు ఆసీస్‌కు షాకిచ్చిన భారత్.. మూడోసారి సిరీస్ విక్టరీతో అదరగొట్టింది. అనంతరం.. కెప్టెన్ సూర్యకు ట్రోఫీని ప్రదానం చేశారు. ట్రోఫీని చేతుల్లోకి తీసుకున్న అతడు చిరునవ్వులు చిందించాడు.
𝑪𝑯𝑨𝑴𝑷𝑰𝑶𝑵𝑺! 🇮🇳🏆
Suryakumar Yadav and his men conquer the Aussie challenge in style! 💪
India maintain their unbeaten T20I series record Down Under — pure dominance continues! 💥#T20Is #AUSvIND #Sportskeeda pic.twitter.com/jRMvIKVI2i
— Sportskeeda (@Sportskeeda) November 8, 2025
‘ఎట్టకేలకు ఒక ట్రోఫీని చేతుల్లోకి తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సిరీస్ విజేతగా నిలిచినందుకు నాకు ట్రోఫీని అందించారు. వారం క్రితమే వన్డే వరల్డ్ కప్ (Womens ODI World Cup) ఛాంపియన్‌గా అవతరించిన మహిళల జట్టు ట్రోఫీని గెలుచుకుంది. ఆ ట్రోఫీ కూడా భారత్‌కు వచ్చేసింది. అందుకే.. ఈ ఆసీస్‌పై సిరీస్ విజయంతో దక్కిన ఈ ట్రోఫీని ముట్టుకొని.. మురిసిపోయాను’ అని మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మిస్టర్ 360 వెల్లడించాడు.
Suryakumar Yadav is yet to lose a series or tournament as India’s T20I captain 👏#SuryakumarYadav #AUSvIND #CricketTwitter pic.twitter.com/S32MU07OIH
— InsideSport (@InsideSportIND) November 8, 2025
నిరుడు టీ20 వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా వారసుడిగా కెప్టెన్సీ చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఆటగాడిగా విఫలమవుతున్నా నాయకుడిగా అతడు జట్టుకు వరుసగా సిరీస్ విజయాలు అందిస్తున్నాడు. ఈ మిస్టర్ 360 అతడి సారథ్యంలో ఇప్పటివరకకూ టీమిండియా ఒక్క సిరీస్ ఓడిపోలేదు. మొదట స్వదేశంలో ఆస్ట్రేలియాపై 4-1తో సిరీస్ పట్టేసిన భారత్.. ఆపై దక్షిణాఫ్రికా గడ్డపై 1-1తో సమం చేసింది.
Special win, special team 🇮🇳💙 Every effort, every moment counted. Grateful to be part of this unit. The ASIA CUP CHAMPIONS 🏆 pic.twitter.com/1DcubDyLAq
— Surya Kumar Yadav (@surya_14kumar) September 28, 2025
అనంతరం శ్రీలంక, బంగ్లాదేశ్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది. ఆ తర్వాత సఫారీలపై 3-1తో, ఇంగ్లండ్‌పై 4-1తో సిరీస్ గెలుపొందింది సూర్యకుమార్ బృందం. ఇదే ఊపులో ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్ ఇప్పుడు ఆస్ట్రేలియాను 2-1తో మట్టికరిపించింది.