IPL 2023 | ముంబై ఇండియన్స్‌పై SRHకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్
IPL 2023 | ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డుల మోత మోగుతున్నది. టీమ్ టోటల్ స్కోర్లలో రికార్డు, ఒక సీజన్లో సిక్సర్ల సంఖ్యలో రికార్డు, ఒక సీజన్లో సెంచరీలో సంఖ్యలో రికార్డు ఇలా ఈ 16వ ఐపీఎల్ సీజన్లో ఎన్నో రికార్డులు బద్దలవుతున్నాయి
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డుల మోత మోగుతున్నది. టీమ్ టోటల్ స్కోర్లలో రికార్డు, ఒక సీజన్లో సిక్సర్ల సంఖ్యలో రికార్డు, ఒక సీజన్లో సెంచరీలో సంఖ్యలో రికార్డు ఇలా ఈ 16వ ఐపీఎల్ సీజన్లో ఎన్నో రికార్డులు బద్దలవుతున్నాయి. ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయినా తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు కూడా ఓ రికార్డు నమోదు చేసింది.
ఇవాళ ముంబై ఇండియన్స్ (MI)తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన SRH జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. MI జట్టుపై SRH టీమ్ ఇంత భారీ స్కోర్ నమోదు చేయడం ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి. గతంలో 193 పరుగులే ముంబైపై SRHకు రికార్డు స్కోర్‌గా ఉన్నది. అయితే MI పై SRH రెండు సార్లు 193 పరుగులు చేసింది. 2021 ఐపీఎల్లో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేయగా, 2022 ఐపీఎల్లో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

