Sunrisers Hyderabad : ఐపీఎల్ అంటే గుర్తుకొచ్చేది ఆటగాళ్ల మెరుపులు. పవర్ హిట్టింగ్తో రికార్డు సెంచరీలు కొట్టేవాళ్లు కొందరైతే.. తమదైన బౌలింగ్ నైపుణ్యంతో వార్తల్లో నిలిచే క్రికెటర్లు మరికొందరు. కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మాత్రం సమిష్టిగా చరిత్రను తిరగరాస్తోంది. అలా అనీ ఒక్క సీజన్‌కే ఆ జట్టు ప్రకంపనలు పరిమితం కాలేదు. టీ20ల్లో విధ్వంసక ఆటకు కేరాఫ్ అయిన కమిన్స్ సేన పొట్టి క్రికెట్ ఆడితేగీడితే ఇలానే ఆడాలని నిరూపిస్తోంది.
అవును.. ఇప్పటికే ఐపీఎల్లో అత్యధిక స్కోర్ కొట్టిన జట్టుగా రికార్డు నెలకొల్పిన ఆరెంజ్ ఆర్మీ 18వ సీజన్ ఆఖరి పోరులోనూ దంచేసింది. తద్వారా ఐపీఎల్ టోర్నీలో అత్యధిక స్కోర్లు చేసిన జట్టుగా మరో రికార్డు తన పేరిట రాసుకుంది సన్‌రైజర్స్. ఐపీఎల్లో అత్యధిక స్కోర్ల జాబితాలో సన్‌రైజర్స్ ఏకంగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచింది. ఆరు టాప్ స్కోర్లను తీసుకుంటే అందులో.. ఐదు ఆరెంజ్ ఆర్మీ పేరిటే ఉండడం విశేషం.
Clean. Clinical. Carnage. 🧡pic.twitter.com/ikgOvb6W5w
— SunRisers Hyderabad (@SunRisers) May 25, 2025
ఐపీఎల్లో 2016లో టైటిల్ కొల్లగొట్టిన తర్వాత.. హైదరాబాద్ జట్టు ఓ రేంజ్లో ఆడుతూ వస్తోంది. నిరుడు మినీ వేలంలో ప్యాట్ కమిన్స్ .. చిచ్చరపిడుగు ట్రావిస్ హెడ్లను కొనడంతో పదిహేడో సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ జట్టటు విధ్వంసానికి రికార్డు స్కోర్ చిన్నబోయింది. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్‌ల మెరుపులతో 3 వికెట్ల నష్టానికే 287 రన్స్ కొట్టింది కమిన్స్ బృందం. దాంతో, అప్పటివరకూ చెక్కుచెదరకుండా ఉన్న కోల్‌కతా రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
🚨 𝗧𝗵𝗲 𝗥𝗲𝗰𝗼𝗿𝗱 𝗶𝘀 𝗯𝗿𝗼𝗸𝗲𝗻 𝗮𝗴𝗮𝗶𝗻 🚨@SunRisers continue to hold the record for the highest total in IPL history 🧡🔥
2⃣8⃣7⃣/3⃣#TATAIPL | #RCBvSRH pic.twitter.com/5VOG8PGB6X
— IndianPremierLeague (@IPL) April 15, 2024
అంతేనా.. అదే ఎడిషన్‌లో ముంబైపై 277 రన్స్ కొట్టిన హైదరాబాద్..18వ ఎడిషన్ ఆరంభ పోరులో రాజస్థాన్ రాయల్స్‌పై విరుచుకుపడింది. ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో 286 పరుగులతో రికార్డు సృష్టించింది. ఢిల్లీ వేదికగా జరిగిన డబుల్ హెడర్ రెండో గేమ్‌లో హెన్రిచ్ క్లాసెన్ విరోచిత శతకంతో గర్జింగా 278 పరుగులు చేసింది హైదరాబాద్. భారీ స్కోర్ల జట్టుగా ముద్రపడిన కమిన్స్ సే.. ఐపీఎల్ అంటే సన్‌రైజర్స్ ఆట చూడాల్సిందే అన్నంతగా గుర్తింపు తెచ్చుకుంది. నిరుడు రన్నరప్ అయిన హైదరాబాద్.. ఈసారి బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యంతో ప్లే ఆఫ్స్‌కు దూరమైంది. అభిమానులను బౌండరీల వర్సంతో ముంచెత్తే కావ్య మారన్ (Kavya Maran) టీమ్.. రాబోయే (19వ) సీజన్లో మరిన్ని రికార్డుల దుమ్ముదులిపేందుకు సిద్ధం కానుంది.